స్థానిక ఈడేపల్లిలోని జట్టి నరసింహం ప్రభుత్వ వృధాశ్రమం ఆవరణలోని భవనంలో ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ విజన్ సెంటరును మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, రిటైర్డ్ జడ్జి జట్టి కృష్ణమూర్తి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ సెంటరులో కంటి ఇబ్బందులు ఉన్న వారికి పరీక్షలు చేయటం, కంటి లోపాన్ని నిర్ధారించి కళ్లజోళ్లు అందజేయటం అభినందనీయమన్నారు.
