బందరులోని ప్రముఖ శైవ క్షేత్రాలు..

0
1000

రామలింగేశ్వరస్వామి దేవాలయం
మచిలీపట్నంలో అతిపురాతనమైన దేవాలయాల్లో రోబర్ట్సన్ పేటలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి.బౌద్దులకాలంలో ఈ ఆలయం ప్రసిద్ధ దర్శనీయ క్షేత్రంగా విరాజిల్లింది.కాలక్రమేణా దేవాలయం కలగభం చెందగా అనంతరం బ్రిటిష్ అధికారి ప్రోత్సాహంతో ఆలయ నిర్మాణంతోపాటు శ్రీరాజరాజేశ్వరి, వీరభద్రస్వామి, కాలభైరవస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు.స్వామివారు రాజరాజేశ్వరి సమేతుడై విరాజిల్లుతున్న ఈ ఆలయ ప్రాంగణంలో రాఘవేంద్రస్వామి, అయ్యప్పస్వామి, నవగ్రహమండపం, శివకోటి స్తూపాలతో ప్రసిద్ద శివాలయంగా నిలుస్తోంది. 2014లో ధ్యానముద్రలో ఉన్న పరమశివుని 36 అడుగుల విరాట్‌ స్వరూపాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలతో ఏర్గాటు చేశారు.



మచిలీపట్నంలోని నాగులేరులో మహాశివరాత్రి రోజున పితృదేవతలకు పిండప్రదానాలు చేసి పూజలు నిర్వహిస్తారు.శివరాత్రి రోజున తెల్లవారుజామునుంచే పుణ్యస్నానాలు ప్రారంభం అవుతాయి. పూజా క్రతువులు నిర్వహించడానికి పండితులు అందుబాటులో ఉంటారు. అధికారులు భక్తుల
సౌకర్యార్ధం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. కాలువలో పుణ్యస్నానం చేసి పక్కనే ఉన్న రసలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. బందరు పట్టణం, మండలంతో పాటు
పెడన, గూడూరు తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు అందరూ ఇక్కడికే వస్తారు. శివరాత్రి రోజున ఈ ప్రాంతం ఉత్సవశోభ సంతరించుకుంటుంది.

శ్రీ అగస్త్యేశ్వర దేవాలయము మచిలీపట్నానికి 36 కి.మీ. దూరములో ఉంది. శివాలయం. ఇక్కడ ప్రధాన దైవము ఏకరాత్రి మల్లికార్జున స్వామి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు విశేషముగా జరుగుతాయి.

శివగంగ దేవాలయం

చింతగుంటపాలెం నాగేశ్వరస్వామి దేవాలయం

గాంధీ బొమ్మ శివాలయం

నాగేశ్వరస్వామి దేవాలయం

Leave a Reply