ఫీజుల కోసం వేధిస్తున్నారంటూ ఆవేద..నచ్చచెప్పిన ఆర్జేడీ..

0
820

ఫీజుల కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ మచిలీపట్నం లోని పద్మావతి హిందూ మహిళా
డిగ్రీ కళాశాల విద్యార్థినులు సోమవారం ఆందోళన చేపట్టారు. యాభై మందికి పైగా విద్యార్థినులు కళాశాల ప్రధాన గేటు ముందు బైఠాయించి,మేనేజ్‌మెంట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కళాశాల కరస్పాండెంట్‌ గోపాల కృష్ట శాస్త్రి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, ససేమిరా అంటూ ఆర్జేడీ వచ్చేంత వరకు తాము ఇక్కడ నుంచి కదిలేదంటూ ఆందోళన కొనసాగించారు. దీంతో విషయం తెలుసుకున్న ఉన్నత విద్యాశాఖ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ విద్యార్థినులతో గదా వా ఆర్జేడీ డేవిడ్‌ కుమార్‌కుమార్‌ ఆందోళన చేస్తున్న విద్యార్థినుల వద్దకు వచ్చి వారి తో మాట్లాడారు. తాము బహిరంగంగా చెబితే యాజమాన్యం వారు మరింత వేధింపులకు గురి చేస్తారని, వ్యక్తిగతంగా
మా ఆవేదన వినాలని వారు కోరడంతో విద్యార్థినులందరినీ సమావేశపు హాల్లోకి తీసుకెళ్లి మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నప్పటికీ, అవి ఆలస్యమౌతున్నాయనే స్థితిలో తమవద్ద బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థినులు తెలిపారు. మరుగు దొడ్లు కంపుకొడుతున్నాయని, చెప్పు కునేందుకు సిగ్గుపడాల్సి వచ్చినా, తప్పటం లేదని, ఈ కారణంగా అంటువ్యాధులు సోకుతున్నాయని వారు ఆవేదన వెళ్లగక్కారు. సరిపడా అధ్యాపకులు లేరని, చిన్నపాటి కార ణానికి కూడా ప్రిన్సిపాల్‌ అనభ్య పదజాలంతో తిడుతుంటారని ఆర్జేడీ ముందు వెల్ల బుచ్చుకున్నారు ఫీజులపై ఒత్తిడి చేయడానికి వీల్లేదు ఆర్టేడీ డేవిద్‌ కుమార్‌ ఎయిడెడ్‌ మేనేజ్‌ మెంట్‌ ఆన్హానవ్సుటకీ, విద్యార్థినులపై ఫీజులు కట్టాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదని ఆర్టేడీ డేవిడ్‌ కుమార్‌ అన్నారు.విద్యార్థినుల సమస్యలు విన్న అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ మాలతీ
రేఖ, కరస్పాండెంట్‌ గోపాలకృష్ణ శాస్త్రితో ఇదే విషయమై సూచనలు వేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలను ఫీజులు కట్టాలని అడుగడానికి కూడా వీల్లేదన్నారు. బాత్‌రూమ్‌లుబాగాలేదని ఆడిపిల్లలు చెప్పినా,పట్టించుకోకపోతే ఎలా, వాటిని శుభం చేసేందుకు కార్మికులను ప్రత్యేకంగా పెట్టాలన్నారు.


Leave a Reply