నేరుగా రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ

0
861


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబడుతున్న ఈ లాక్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కృష్ణ జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపిఎస్., గారు మచిలీపట్నం వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపట్టారు

నేరుగా రంగంలోకి దిగి వాహనంపై మచిలీపట్నం లోని లక్ష్మీ టాకీస్, జిల్లా పరిషత్, జిల్లా కోర్టు సెంటర్, బస్ స్టాండ్ , కోనేరు సెంటర్, రాజా గారు సెంటర్ కోట వారి తుళ్ల సెంటర్ పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు

నిత్యావసరాలు మినహా నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన దుకాణాలపై దాడులు చేసి, ఎవరైనా నిత్యావసర సరుకులు కాకుండా , దుకాణాలు ఓపెన్ చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని యజమానులకు హెచ్చరికలు జారీ చేసి దగ్గరుండి మరీ దుకాణాలను మూసి వేయించారు

##ఎస్పీ గారు మాట్లాడుతూ##…..

జిల్లాలో లాక్ డౌన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ప్రజల సహకారం కూడా మెండుగా ఉంది

బందరులో ప్రజలు క్రమశిక్షణతో మెలుగుతూ వారు నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసే సమయంలో సామాజిక దూరం పాటిస్తున్నారు

నిత్యవసర సరుకుల దుకాణాలు మినహా మిగిలిన వాటిపై ప్రత్యేక దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నాం

అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాల దాడులపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నాం

జిల్లా లో హైవేలపై ఉన్న డ్రైవర్లకు, క్లీనర్లకు దాతల సహకారంతో ఆహార పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నాం

*ఈ లాక్ డౌన్ అమలు జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతోంది

ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో 144 మంది పై హోమ్ ఐసోలేషన్ వద్ద పోలీసు నిఘా కొనసాగుతోంది*

Leave a Reply