నేడు మచిలీపట్టణం నుండి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు…

0
806

ప్రయాణికుల సౌకర్యార్థం నేడు మచిలీపట్టణం నుండి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును
నడుపుతున్నట్లు మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ మేనేజ పామర్తి నాగేశ్వరరావు తెలిపారు. 07051 నెంబరు గల రైలు సోమవారం రాత్రి 11 .15 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మంగళవారం ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుందన్నారు. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రైలుకు రిజర్వేషన్‌ చేసుకోవచ్చని చెప్పారు. మచిలీపట్నంలో ప్రారంభమైన రైలు గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌ స్టేషన్లలో ఆగుతుందని,ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.


Leave a Reply