వినియోగదారుల బంగారాన్ని గోల్‌మాల్ చేసిన మచిలీవట్నం కెనరా బ్యాంక్ వినియోగదారులకు రూ.2,70,318లు నెల రోజుల్లో చెల్లించాలని ఆదేశిస్తూ కృష్టాజిల్లా పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఆర్.పుండరీకాక్షుడు, సభ్యులు సిహెచ్.అరుణ్‌ప్రసాద్, ధనలక్ష్మీ తీర్పుచెప్పారు. మచిలీపట్నానికి చెందిన బొడ్డు సుభాషిణి ఏప్రిల్ 7,2016 న తన అవసరాలకు 73 గ్రాముల బంగారాన్నిమచిలీపట్నం కెనరా బ్యాంక్‌లో గోల్డలోఆన్ కింద పెట్టి రూ.లక్ష తీసుకున్నారు. ఆ బ్యాంక్‌కు చెందిన గోల్డ్ ఆఫీసర్ ఘంటసాల వెంకటనాగసుబ్రహ్మణ్యం బ్యాంక్ లాకర్‌లోని బంగారం కాజేసి వినియోగదారులను నష్టపరిచిన విషయం తెలిసిందే. నాలుగు సంవత్సరాలు గడున్తున్నా తన బంగారం గురించి బ్యాంక్ అధికారులు స్పందించక పోవడంతో సుభాషిణి తగిన ఆధారాలతో పర్మినెంట్ లోక్‌అదాలత్‌ను ఆశ్రయించింది.సుభాషిణిని, బ్యాంక్ అధికారులను విచారించినపర్మినెంట్ లోక్‌అదాలత్ నగలు మాయం కావడానికి బ్యాంక్ అధికారులే బాధ్యతవహించాలని ఆదేశిస్తూ వారం రోజుల్లోపు సుభాషిణి బ్యాంక్‌కు రూ.లక్ష చెల్లించాలని,దరిమిలా నెల రోజుల్లోపు ఈ రోజు ఉన్న బంగారపు ధర ప్రకారం రూ.270,319 ఆరు శాతం వడ్డీతో తిరిగి సుభాషిణికి చెల్లించాలని కెనరా బ్యాంక్ అధికారులను ఆదేశిస్తూ లోక్‌అదాలత్ తీర్పు చెప్పింది. పిటిషనర్ తరుపున న్యాయవాది తాతా గోపీ కేసు వాదించారు.