నిర్మాతగా మారబోతున్న ఎమ్.ఎస్ ధోని.

0
738

టీమిండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌కి చెందిన 106 మందితో కూడిన ట్రూప్‌తో కశ్మీర్ లోయలో పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీలను ధోనీ నిర్వర్తించిన విషయం తెలిసిందే. 2011లో ధోనీకి సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించడం జరిగింది. 2015 సంవత్సరం ఆగ్రాలో ధోనీ తొలిసారి సైనిక పారాట్రూపర్‌గా శిక్షణ తీసుకున్నారు. విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో 5 సార్లు దూకి ఆయన ఈ శిక్షణ పొందారు. ఇక ఇన్నాళ్ళు క్రికెట్‌లో రికార్డులు నమోదు చేసిన ధోని ఇప్పుడు బుల్లితెరపై సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. పరమవీర చక్ర, అశోక చక్ర పొందిన ధైర్యవంతులైన ఆర్మీ ఆఫీసర్స్ జీవిత నేపథ్యంలో టీవీ షో చేసేందుకు ధోని సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ షోతో ధోని నిర్మాత అవతారం ఎత్తనున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌, స్టూడియోనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ షోకి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం లాంచ్ కానుంది. సోనీ టీవీలో ధోని నిర్మిస్తున్న షో ప్రసారం కానున్నట్టు సమాచారం. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ ఆ మధ్య కశ్మీర్ లోయలో సైనిక సేవలందించారు. ఆ సమయంలో సైనికులని దగ్గరగా గమనించారు. వారి కష్ట సుఖాలని తెలుసుకున్నారు. వీటిని ప్రజలకి కూడా తెలియజేయాలనే ఆసక్తితో టీవీ షో చేస్తున్నట్టు తెలుస్తుంది.

Leave a Reply