నాగాయలంక నుంచి పెడనకు వంట గ్యాస్ పైపులైన్ పర్యవేక్షిస్తున్న అధికారులు నగరంలో త్వరలో పైపులైన్ల ద్వారా వంట గ్యాస్‌ను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాగాయలంక నుంచి పెడనకు పైపులైన్న ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.ప్రస్తుతం 56 కిలోమీటర్ల మేర పైపులైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. నాగాయలంకలోని ఓఎన్‌జీసీ బావి నుంచి నేరుగా వంట గ్యాస్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా మొదటి దశలో పెడన వరకు పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇంటింటికీ పైపులైను కనెక్షన్ ఇస్తే నగర ప్రజలు వంట గ్యాస్ కోసం తిరిగే పరిస్థితి నుంచి విముక్తి లభిస్తుంది. ఇప్పటికే ముంబాయి, బెంగళూరు, చెన్నై విశాఖ వంటి నగరాల్లో పైపలైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసే ప్రక్రియ బైపాస్ రోడ్డులో వెల్తింగ్ చేస్తున్న సిబ్బంది, బందరులో జరుగుతున్న పైపులైన్త పనులు ప్రారంభమైంది. ఇదే రీతిలో జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కూడా పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు జరుగుతున్నాయి. మెగా కంపెనీ ఈ బాధ్యతలను స్వీకరించింది. జనవరి లోగా పైపులైన్ల పనులు పూర్తి చేయాలనే లక్ష్యం తో ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, నగరపాలక సంస్థల నుంచి క్రాసింగ్‌ల వద్ద అనుమతులు లభించలేదు. దీంతో జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం పైపులైన్సకు వెల్లింగ్ చేసిన తరువాత వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.గ్యాస్ లీక్ కాకుండా వెల్లింగ్ చేశారా లేదా అనే దానిపై పరీక్షలు జరుగుతున్నాయి. కాస్ట్ ఐరన్ పైపులైన్లు తుప్పు పట్టకుండా రబ్బర్ కోటింగ్ వేశారు. పైపు నేచురల్ గ్యాస్(పేఎన్‌జీ) అధికారులు ఎప్పటికప్పుడు పైపులైన్సను
పరిశీలిస్తున్నారు. స్థానిక బైపాస్‌రోడ్డు వద్ద పైపులైన్ నిర్మాణ పనులు చురుగ్గా
సాగుతున్నాయి. పనులకు ఇబ్బంది లేకుండా వాహనాలను మళ్లిస్తున్నారు.

