తెలుగుకి తెగులు పట్టిస్తున్నారు

0
660

శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందుగా 15వ శతాబ్ది తొలి అర్థభాగంలో జీవించిన “వినుకొండ వల్లభరాయుడు” అనే కవి తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చి “దేశ భాషలందు తెలుగు లెస్స” అనే వాక్యాన్ని ఉటంకించారు.ఇప్పుడు ఆ తెలుగుకి కూడా తెగులు పట్టిస్తున్నారు.తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసే ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఫ్యాప్టో నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే విద్యాసంవత్సరం 20-21 నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం రద్దు చేసి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా విద్యాశాఖకార్యాలయం వద్ద నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకేసారి అన్ని సబ్జెక్టులు ఇంగ్లీషు మీడియంలోకి మార్చితే విద్యార్థులు మధ్యలోనే మానేసే ప్రమాదం ఉందని. మాతృభాష మాధ్యమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర,రాష్ర కమిటీలు సూచిస్తున్నాయని తెలిపారు.

Leave a Reply