తప్పిపోయిన పిల్లలను పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మచిలీపట్నం అరవగూడెంకు చెందిన చిన్నారులు మోర్ల ప్రణతి వెంకటనాగలక్ష్మి,హర్షితలు సోమవారం ఉదయం చిరుతిండ్లు కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లారు. అలా వెళ్లిన పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తండ్రి నాగసురేష్ పిల్లల కోసం చుట్టుపక్కల వెతికి, అందరినీ ఆరా తీశాడు. కానీ పిల్లల ఆచూకీ తెలియలేదు. కంగారుపడిన నాగసురేష్ వెంటనే డయల్100కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో ఆర్‌పేట పోలీసులు తప్పిపోయిన పిల్లలను తండ్రికి అప్పగిస్తున్నఆర్‌పేట పోలీసులు చిన్నారుల కోసం జల్లెడ పట్టారు. పక్కవీధుల్లో తచ్చాడుతున్న చిన్నారుల ఆచూకీ కనుగొని వారిని తండ్రి నాగసురేష్‌కు చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
