టీ-20 ర్యాంకింగ్స్‌: సత్తాచాటిన టీమిండియా ప్లేయర్స్‌..

0
720

విండీస్‌ సిరీస్‌లో అదరగగొట్టిన టీమిండియా ప్లేయర్స్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ ప్రకటించిన టీ-20 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. ముంబైలో హాఫ్‌ సెంచరీలతో దుమ్మురేపిన రాహుల్, రోహిత్, కోహ్లీ టాప్‌-10లో నిలిచారు. ఐసీసీ వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజీషన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. గత కొంతకాలంగా టీ20ల్లో మాత్రం కనీసం టాప్-10లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో పాటు 183 పరుగులు చేసిన మళ్లీ టాప్-10లోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ర్యాంకింగ్స్‌లోనూ ఐదు స్థానాలు పైకి ఎగబాకిన కోహ్లీ 10వ ర్యాంక్‌ని అందుకున్నాడు. ఇక వాంఖడే టీ20లో 91 పరుగులు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆరో ర్యాంక్‌కి చేరుకోగా.. తొలి రెండు టీ20ల్లో ఫెయిలై మూడో టీ20లో 71 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఒక స్థానం చేజార్చుకుని 9వ ర్యాంక్‌తో సరిపెట్టాడు.

Leave a Reply