టీమిండియా గెలుపు…..

0
668

నాగ్‌పూర్‌లో అద్భుతం జరిగింది. బంగ్లాదేశ్‌ చేతిలో టి20 సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడిన నమయంలో టీమిండియా తీవ్ర ఒత్తిడి మధ్య ఉవ్వెత్తున లేచింది. 43 బంతుల్లో 65 పరుగులు చేస్తే గెలిచే స్థితిలో నిలిచిన బంగ్లాదేశ్‌ను కుప్పకూల్చి ఒక్కసారిగా తన స్థాయిని ప్రదర్శించి పరువు నిలబెట్టుకుంది. 84 పరుగుల వ్యవధిలో మిగిలిన 8 వికెట్లు తీసి సొంతగడ్డపై దర్జాగా సిరీస్‌ను సొంతం చేనుకుంది. మ్యాచ్‌ కీలక దశలో రెండు ప్రధాన వికెట్లు తీసి శివమ్‌ దూబే విజయానికి బాటలు వేస్తే… ఏకంగా 6 వికెట్ల ప్రదర్శనతో దీపక్‌ చహర్‌ అదరగొట్టాడు.చహర్‌ ప్రదర్శన అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమం కాగా, భారత్‌ తరపున టి20ల్లో తొలి హ్యాట్రిక్‌ తీసిన అరుదైన బౌలర్‌గా కూడా అతను నిలిచాడు. తన 8వ ఓవర్‌ చివరి బంతికి వికెట్‌ తీసిన చహర్‌… నాలుగో ఓవర్‌ తొలి రెండుబంతులకు వికెట్లు పడగొట్టి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేశాడు. అంతకుముందు శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌ అర్ధసెంచరీలతో టీమిండియా స్కోరులో ప్రధాన పాత్ర పోషించారు.

Leave a Reply