జెండా వీరుడు,స్వాతంత్ర్య సమరయోధుడు-తోట నరసయ్య నాయుడు–మచిలీపట్నం

0
1145

తోట నరసయ్య నాయుడు మచిలీపట్నం, పాగోలు తాలూకాకు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు.ఇతడు చల్లపల్లి జమీందారు ఆస్థానంలో మల్లయోధుడిగా పనిచేశాడు.

1930, మే 6వ తేదీన దండి యాత్రను నాయకత్వం వహిస్తున్న మహాత్మాగాంధీని అరెస్టు చేయడంతో దేశమంతా అల్లర్లు చెలరేగాయి. మచిలీపట్నంలో కూడా తోట నరసయ్యనాయుడు ఇతర నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాడు.

తోట నరసయ్య నాయుడు మరో ఇద్దరితో కలిసి మచిలీపట్నం లోని కోనేరు సెంటర్లో ఉన్న పొడవైన స్తంభంపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించాడు.ఈ చర్యను నిరోధించడానికి పోలీసులు వారిపై లాఠీ దెబ్బల వర్షం కురిపించారు. అయినా నినాదాలు చేస్తూ ఆ స్తంభం ఎక్కడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు తోట నరసయ్యనాయుడు స్తంభం ఎక్కి జెండాను ఎగుర వేయగలిగాడు. సుమారు 45 నిమిషాలు పోలీసులపై లాఠీ దెబ్బలు తిన్న తర్వాత ఇతడు స్తంభం పై నుండి కుప్పకూలి క్రింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.

Leave a Reply