చిలకలపూడి పాండురంగస్వామి కల్యాణోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకుడు క.గంగాధరం,సహ అర్చకుడు నరసింహం ధ్వజపటాన్ని ఎగురవేశారు. అనంతరం స్వామివారి సరస్సు,వృక్షం వద్గ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాండరంగస్వామి పాదాలను స్పృశించి భక్తులు తన్మయం పొందారు. రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తిరుమల తిరుపతి దేవస్తానం ఆస్తాన విద్వాంసురాలు కె.మాధవి సంగీత కచేరి నిర్వహించారు.అన్నమయ్య రామదాను కీర్తనలు ఆలపించారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్‌శివరామకృష్ణ,మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ నిలార్‌దాదా,బొర్రా విఠల్, వెంట్రప్రగడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.