నిన్న అనగా 26 జనవరి హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన మచిలీపట్టణం పూర్వవిద్యార్థుల అపురూప కలయక కార్యక్రమం సందడి నెలకొంది.మచిలీపట్నంలోని వేర్వేరు పాఠశాలల్లో,కళాశాలల్లో చదివిన విద్యార్థులు,ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆలివ్ స్వీట్స్ అధినేత శ్రీ దొరరాజు గారు తమ చిన్నప్పటి స్నేహితుడైన మద్దుల గిరీష్ కుమార్ తో కలిసి ఏటా 26 జనవరి న పూర్వ విద్యార్థుల అపురూప కలయిక నిర్వహిస్తున్నారు.అలాగే ఈ ఏడు కూడా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కూడా పాల్గొన్నారు.




