గొల్లపూడి మారుతీరావుగారికి కు బందరుతో అనుబంధం …

0
686

గొల్లపూడి మారుతీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని పలువురు సాహితీవేత్తలు పేర్కొన్నారు. మారుతీరావు ఆకాలమరణం పట్ల వారు సంతాపాన్ని వెలిబుచ్చారు. గొల్లవూడికి బందరుతో కూడా అనుబంధం ఉంది. నాటకాలు వేసే సమీయంలో బందరు టౌన్‌హాల్లో ప్రదర్శించిన
కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు పలువురు కళాకారులు చెబుతున్నారు. చదివింది సైన్సు అయినా సాహిత్య సృజనలో ఆయన ప్రతిభ ఆలయశిఖరం లాంటిదని తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అప్పినేడి పోతురాజు తెలిపారు. వక్త, వ్యాఖ్యాత, కథారచయిత, నాటకకర్త, సినీ సంభాషణల రచయితగా అనేక పాత్రలు పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు,మారుతీరావు మరణం సాహితీ రంగానికి తీరని లోటని సమాఖ్య ప్రతినిధులు పైడిపాటి రామ్‌దేవ్‌, మడమల రాంబాబులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సదస్సులో గొల్లపూడితో వేదికను పంచుకోవడం తన అదృష్టమని వ్యక్తిత్వ వికాసనిపుణుడు విడియాల చక్రవర్తి అన్నారు. రాయడం, మాట్లాడడం, నటించడం అనేది అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమని అలాంటి వ్యక్తుల్లో గొల్లపూడి ఒకరని తెలిపారు. సాహితీ రంగాన్ని తీరని దుఃఖ సాగరంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని బందరుకు చెందిన పలు, సాహితీసంస్థల ప్రతినిధులు ప్రగాఢ సంతాన్ని తెలిపారు.


Leave a Reply