గురజాడ అప్పారావు జయంతి ….

0
789

గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఆధునిక తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ జీవిత విశేషాల గురించి ప్రముఖ కథానవలా రచయిత్రి, ప్రభుత్వ ఐటీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ అల్లూరి గౌరీలక్ష్మి ప్రసంగించారు.అమె మాట్లాడుతూ సమాజంలోని దురాచారాలపై పోరాటం చేసిన గొప్ప కవి గురజాడ అని పేర్కొన్నారు. ప్రిన్సిపల్‌ డా.అనీల బిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, తెలుగు పివిభాగాధిపతి డా.జీబీ ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ గురజాడ అప్పారావు నవయుగ వైతాళికుడు అని శ్లాఘించారు. పూర్ణమ్మ గేయాన్ని. విద్యార్థులు నృత్యరూపకంగా ప్రదర్శించారు. అధ్యాపకులు మేరీ ధవళాంబరి, ప్రియాంక,హవీల, ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply