గుంటూరు జిల్లాలో 114 కరోనా కేసులు..

0
530

రాష్ట్రంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే మరో 47 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరు జిల్లాలో నమోదైన కేసులే 21 ఉన్నాయి. ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 114కి చేరింది. రాష్ట్రంలో 100కిపైగా కరోనా కేసులు నమోదైన మొదటి జిల్లా గుంటూరే. కర్నూలు జిల్లాలో 93 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 486కి చేరింది. సోమవారం రాత్రి 10 నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు కృష్ణాలో 8, కర్నూలులో 9, అనంతపురంలో 6, కడపలో 2, ప్రకాశంలో ఒక కేసు నమోదయ్యాయి.

Leave a Reply