ప్రస్తుత కాలంలో వంట కోసం గ్యాస్ సిలిండర్ వినియోగించని ఇల్లు లేదంటే అతిశయోక్తి
కాదు. అయితే గ్యాస్ సిలిండర్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అటు అధికారులు… ఇటు డీలర్లు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లక తప్పుదు. మనం వాడే నిత్యావసర వస్తువులు, మందులపై గడువు తేదీ ఎలా ఉంటుందో నిజ జీవితంలో వంట కోసం వినియోగించే సిలిండర్లకు కూడా గడువు తేదీ ఉంటుంది. ఈ విషయం చాలామంది వినియోగదారులకు తెలియదు. గడువు తేదీ లోపు మాత్రమే సిలిండర్‌ను వినియోగించాలి సంవత్సరాన్ని (12 నెలలు) మూడు నెలలకొక భాగం చొప్పున నాలుగు భాగాలుగా విభజిస్తారు. విభజించిన భాగాలకు ఒక ఇంగ్లిషు అక్షరం కేటాయిస్తారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు ఎ అక్షరాన్ని,ఏప్రిల్, మే, జూన్ నెలలకు బి అక్షరం, జూలై,ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సి అక్షరాన్ని, అక్టోబర్,నవంబర్, డిసెంబర్ నెలలకు డి అక్షరాన్ని సిలిండర్‌పై రాసి ఉంటారు. ఉదాహరణకు సిలిండర్‌కమ్మిపై డి- 18 అని ఉంటే 2018వ సంవత్సరం అక్షోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోపు వరకే సిలిండర్‌ను వినియోగించాలని అర్ధం. ఆ నెల దాటితే సిలిండర్‌ను పక్కను పెట్టడమే మంచింది.
వినియోగదారులకు సూచనలు:-
1.వంట చేసే ముందు గ్యాస్ స్టౌ సిలిండర్‌ను జాగ్రత్తగా గమనించాలి.
2.వంట గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచుకోవాలి.గ్యాస్ లీకవుతున్నా, వాసన వస్తున్నా స్టవ్ వెలిగించరాదు.
3.సేఫ్టీ పిన్ అమర్చి సిలిండర్‌ను ఖాళీ ప్రదేశంలో ఉంచాలి.వెంటనే అత్యవసర నంబర్లకు ఫోన్ చేయాలి లేదా డీలర్‌ను సంప్రదించాలి.వంట గది తలుపు కింద కనీసం అరఅంగుళం ఖాళీ ఉంచడం మంచిది.
4.గ్యాస్ పూజ గది, రిఫ్రిజిరేటర్ ఉన్న చోట పెట్టడం మంచిది కాదు.
5.అ వంట పూర్తవగానే రెగ్యులేటర్ ఆపి మూత పెట్టాలి.
6.గ్యాస్ సిలిండర్ దగ్గర త్వరగా మంట అంటుకునే వస్తువులు ఉంచరాదు.
ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సిలెండర్ వల్ల వచ్చే ప్రమాదాలను అరికట్టవచ్చు.
