“క్రిడా జ్యోతికి ఆర్థిక సాయం”….

0
805

క్రికెట్‌లో సత్తా చాటుతున్న బందరుకు చెందిన తమ్మన మంజును ప్రోత్సహించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. అండర్‌-19 విభాగంలో భారత మహిళా జట్టులో చోటు దక్కించుకున్న మంజు నేపాల్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. స్థానిక హిందూ కాలేజీలో మంజు డిగ్రీ చదువుతోంది. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో చదువుల కోసమని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా “పనిచేస్తూనే, డిగ్రీ చదువుతోంది. ‘సాక్షిలో “క్రీడా జ్యోతి’పై వచ్చిన ప్రత్యేక కథనానికి అర్బన్‌ బ్యాంకు మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు బొర్ర విఠల్‌ స్పందించారు. మంజుకు రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని శుక్రవారం అందజేశారు. అదే విధంగా సెంట్రల్‌ బ్యాంకు మాజీ డైరెక్టర్‌ మంజుకు నగదు అందజేస్తున్న బొర్రా విఠల్‌ బాల ఏసు రూ.5 వేలు అందించారు. దీంతో మంజు నేపాల్‌ నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతోంది. మరికొంతమంది దాతలు కూడా మంజుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు.చిలకలపూడికి చెందిన పాల వ్యాపారి పుట్టి బాబి రూ.8 వేలు, మాధవ్‌ రూ.2 వేలు సాయం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here