క్రికెట్లో రాణిస్తున్న బందరు విద్యార్థినులు…

0
931

విజయమే లక్ష్యంగా పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏది లేదని రుజువుచేశారు బందరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మంజు మరియు నీరజ.పేదకుటుంబానికి చెందిన వీరు ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా క్రికెట్లో తమకున్న పరిమితమైన వనరులే సద్వినియోగం చేసుకుని చక్కని ఆటతీరు ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నారు.త్వరలో జరగనున్న అంతర్జాతీయ పోటీలలో వీరిద్దరూ తమ సత్తా చాటుతామని ధీమాగా చెబుతున్నారు. కైకలూరుకు చెందిన మంజు కుటుంబం ఆమె ఎనిమిదొవ తరగతిలోనే బందరులో స్థిరపడింది .చిన్నప్పటినుండి కోకో అంటే ఆమెకు చాల ఇష్టం.చుట్టుపక్కల పిల్లలు క్రికెట్ ఆడుతుంటే వారితోపాటు ఆడటం మొదలు పెట్టింది.ఇంటర్ లేడీ అంప్తిల్ కళాశాలలో చేరగా పి.డి జ్యోతి ప్రోత్సాహం అందించారు. డిగ్రీ హిందూ కళాశాలలో చేరిన ఆమె వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది.యూపీపై చక్కని బౌలింగ్‌ ప్రదర్శన చేసిన మంజుకు గోవాలో జరిగే దక్షిణాసియా టోర్నీలో భారత జట్టుకు ఆడే అవకాశం దక్కింది.అలాగే నీరజ గురించి మన గ్రూప్లో పోస్ట్ చేసాము.వీళ్లిద్దరు ఆర్ధిక సాయం కోసం చూస్తున్నారు.

Leave a Reply