కోల్‌కతాలో ఐపీఎల్‌-2020 ఆటగాళ్ల వేలం…

0
708

కోల్‌కతాలో ఐపీఎల్‌-2020 ఆటగాళ్ల వేలం కొనసాగుతోంది. ఐపీఎల్‌ వేలంలో 332 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డారు. వేలంలో మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా)ను రూ.10.75 కోట్లకు పంజాబ్‌ కొనుగోలు చేసింది. అలాగే రూ.2 కోట్లకు క్రిస్‌లీ (ఆసీస్‌)ను ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. రూ.5.25 కోట్లకు ఇయాన్‌ మోర్గాన్‌ (ఇంగ్లండ్‌)ను కోల్‌కతా దక్కించుకుంది. రూ.3 కోట్లకు రాబిన్‌ ఊతప్పను రాజస్థాన్‌ దక్కించుకుంది. జాసన్‌ రాయ్‌ (ఇంగ్లండ్‌)ను రూ.1.5 కోట్లకు ఢిల్లి క్యాపిటల్స్‌ దక్కించుకుంది. ఆరోన్‌ ఫించ్‌ (ఆస్ట్రేలియా)ను రూ.4.40 కోట్లకు బెంగళూరు కొనుగోలు చేసింది.

Leave a Reply