శంకరమఠంలో సోమవారం రాత్రి ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎన్‌ఆర్‌ఐ కోలవెన్ను
శ్రీలక్ష్మి నిర్వహించిన కర్ణాటక సంగీత గాత్రకచేరీ శ్రోతలను వీనుల విందు చేసింది.
శంకరమఠం కార్యదర్శి పురాణం రామకృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో గాయకురాలు లక్ష్మి అన్నమయ్య,త్యాగరాజు కీర్తనలను గానం చేశారు. తన ఐదోయేట నుంచే బందరులో సంగీతాన్ని అభ్యసించిన శ్రీలక్ష్మి విజయవాడ సంగీత కళాశాలలోమ్యూజిక్ డిప్లమో చేశారు. అన్నవరపు రామస్వామి వద్గ సంగీత మెళకువలు తెలుసుకున్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్‌కోలో ఉంటున్న శ్రీలక్ష్మి నిలికానాంధ్ర పక్షాన గాత్ర కచేరీలు చేస్తున్నారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ ఈ సందర్భంగా గాయనీమణి శ్రీలక్ష్మిని సత్కరించారు. అన్నమయ్య కీర్తనలను స్వరపరచి తిరుమల తిరుపతి దేవస్తానానికి క్యాసెట్ల రూపంలో అందించారు.

