తెలుగు తేజం, చెస్ ప్లేయర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నాడు మాస్కోలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన లీ తింగ్జీపై ఘన విజయం సాధించింది.
* 15 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ హోదా.
* పదేళ్ల వయస్సులో ప్రపంచ యూత్ చెస్‌లో మూడు స్వర్ణాలతో సంచలనం.
* జూనియర్ ప్రపంచ ఛాంపియని షిప్‌లో టైటిల్.
* 2600కు పైగా ఎలో రేటింగ్ సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఘనత.
కానీ హంపి అందరి అంచనాలను తలకిందులు చేసింది. కేవలం తండ్రి ఇచ్చిన శిక్షణతో రాటు దేలారు. సొంతంగా సాధన చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు కోనేరు హంపి. 2019లో ఫిడె మహిళల గ్రాండ్ ప్రి టైటిల్ సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో హంపి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి విజయం సాధించారు హంపి.
* ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ షిప్‌లో కాంస్యం.
* 1997లో ప్రపంచ యూత్ చెస్‌లో ఒకేసారి అండర్ – 10, 12, 14 విభాగాల్లో స్వర్ణాలు గెలిచారు.
* అత్యంత పిన్న వయస్సులో (15 ఏళ్ల 67 రోజులు) గ్రాండ్ మాస్టరైన మహిళా క్రీడాకారిణిగా 2002లో రికార్డు నెలకొల్పారు.
* అనంతరం హంపి ఎన్నో గొప్ప విజయాలు నమోదు చేశారు.
