కొనసాగుతున్న భారత్‌ బంద్‌

0
739

నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పలు చోట్ల బంద్ ప్రారంభమైంది.  ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకంగా ఈ సమ్మె జరగనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్‌లో దాదాపు 25 కోట్ల మంది దాకా పాల్గొంటున్నారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి.కొన్ని ప్రాంతాలలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుండగా,కొన్ని ప్రాంతాల్లో బంద్ ఉద్రిక్తతను చోటు చేసుకుంది.బస్టాండ్‌ ఎదుట జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్‌ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్‌ చేపట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.బస్టాండ్‌ వద్ద వామపక్ష పార్టీ నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.బంద్ నిప్రశాంతంగా కొనసాగించాలని CITU పిలుపునిచ్చింది.

Leave a Reply