కాలగర్భంలోకి ఆంధ్రా బ్యాంకు…రేపు యూనియన్‌ బ్యాంకులో విలీనం…

0
724

తెలుగు వారికి గడిచిన 97 సంవత్సారాలుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఆర్థిక నేస్తం ఆంధ్రాబ్యాంక్ కాలగర్భంలో కలిసిపోనుంది. ఏప్రిల్‌ 1 నుంచి మరో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్‌సబీ) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లో విలీనమవుతూ తన ఉనికినే కోల్పోతోంది. ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ యూబీఐలో విలీనమవుతోంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మన మచిలీపట్టణం వాస్తవ్యులు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. ఇందిరాగాంధీ చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణలో భాగంగా 1980 ఏప్రిల్‌లో ఆంధ్రా బ్యాంక్‌ జాతీయ బ్యాంకుగా అవతరించింది. 2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఏటీఎంలకు ఆంధ్రాబ్యాంకు విస్తరించింది. 1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారాన్ని ప్రారంభించింది. కాగా యూబీఐలో విలీనాన్ని ఆంధ్రా బ్యాంక్‌ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకుల బలోపేతానికి విలీనాలు పరిష్కారం కాదని, దీనివల్ల ఉద్యోగుల ఉద్యోగ భద్రతకూ ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విలీనం తర్వాత దాదాపు 700 శాఖలను క్రమబద్ధీకరిస్తామని యూబీఐ ఎండీ, సీఈఓ ప్రకటించారు.

Leave a Reply