కాన్సర్ బాధితురాలికి 10 లక్షల మంజూరు ….

0
737

రాజుపేటలో బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న వరద హేమాంబికకు మెరుగైన చికిత్స పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షల మంజూరు పత్రాన్ని వైఎస్సార్‌ సీపీ నాయకులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆరు నెలలుగా హేమాంబిక బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమె పరిస్థితీని మంత్రిపేర్ని వెంకట్రామయ్య (నాని)కు తెలపగా,ఆయన స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయించారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హేమాంబిక తండ్రి సత్యేంద్ర ధన్యవాదాలు తెలిపారు. మాజీ కౌన్సిలర్‌ మట్టా తులసి, వైఎస్సార్‌ సీపీ నాయకులు షేక్‌ ఇక్బాలీ, నూకల ప్రసాద్‌, జవ్వాది రాంబాబు,వీరబాబు, సేనాపతి వెంకటరవుణ తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply