కాండ్రేగుల జోగిపంతులు…

0
794

కాండ్రేగుల జోగిపంతులు క్రీ.శ 1760 వ దశాబ్దంలో మచిలీబందరు[1] (ఇప్పటి కృష్ణాజిల్లాలోని మచిలీపట్టణం ) లో దుభాషి (ద్విభాషికి పర్యాయపదము) గా పెద్ద పలుకు బడిగల పదవిలో పనిచేసి దివిసీమలో కొన్ని వూళ్లలో హవేలీభూమూలును జాగీరులుగా పొందిన ప్రముఖుడు. క్రీ.శ 1762 నవంబరు నుండి 1766 ఆగస్టు వరకూ బందరులో ఆంగ్ల వర్తక కంపెనీ ముఖ్యసభ్యుడైన (chief in council)  (John Phybus) అను దొరగారికి జోగిపంతులు గారు సొంత స్వదుభాషి (personal Dubhashi) గా వ్యవహరించేవారు.దొరగారి తరఫున హైదరాబాదు నవాబు గారితో రాయబారము జరిపేవారు. జోగిపంతులు గారి పూర్తి పేరు కాండ్రేగుల జోగి జగన్నాధరావు. వారి పుట్టుపూర్వోత్తరాలుగూర్చిన వృత్తాంతం దొరకలేదు.కాండ్రేగుల అనే గ్రామం పెద్దాపురం జమీందారీలో (ఇప్పటి తూర్పుగోదావరి జిల్లా లో) ఉంది. జోగి పంతులు గొప్ప కార్యదక్షులు. రాజకీయతంత్రవేత్త. మచిలీబందరులో ఆయన కచ్చేరీ పెట్టి వ్యవహారాలు చక్కపెబ్టేవారు.

జోగిపంతులుగారి చరిత్రతోపాటు సమకాలీక దేశచరిత్ర ముఖ్య చరిత్రాంశములు ఆంధ్రదేశము లోని సర్కారులచరిత్రకు సంబంధించినవి చెప్పక తప్పదు. ఈస్టు ఇండియా కంపెనీ అనే ఆంగ్లేయ, ఫ్రెంచి కంపెనీల, హైదరాబాదు నవాబు సోదరులు (సలాబత్ జంగ్, నిజాం అలీఖాం, బసాయత్ జంగ్) సర్కారులులో వారి కౌలుదారు (హుస్సేనాలీ) మధ్యవున్నటువంటి వైషమ్యాలు, లావాదేవీలు రాజకీయ తంత్రములు చాలా జరిగినవి. తేదీలవారీగా (chronological) చరిత్రాంశములు క్లుప్తముగా ఇక్కడ వివిరించడమైనది. 14-05-1759 న సలాబత్ జంగు గారు ఆంగ్లేయులకు మచిలీ పట్టణంనిజాంపట్టణంకొండపల్లి సర్కారులోని గుడివాడ మరియ ఇంకా కొన్ని గ్రామములను 80 మైళ్ళుపొడవు 20 మైళ్ళ వెడల్పు గల భూభాగాన్ని బహుమతిగా నిచ్చారు. కానీ సలాబత్ జంగు గారిని కూలద్రోసి తనే సుబేదారుడనన్ననిజాం అలీఖాం గారు క్రీ.శ 1760 లో బెజవాడకు వచ్చినప్పుడు వారిని అప్పటి ఆంగ్లేయ కంపెనీ ముఖ్యసభ్యుడైన అలేక్జాండర్ ను కలుసుకుని జరిపిన చర్చలలో నిజాం అలీఖాం గారు ఆంగ్లేయకంపెనీ వారు కనక తనకు 100మంది ఇంగ్లీషు సోలడ్జర్లనూ, 1500 సిపాయలను, కొన్ని ఫిరంగులను ఇచ్చేటట్టైతే తను ఆంగ్లేయ కంపెనీవారికి నెలకు లక్ష రూపాయలు ఇచ్చెదననీనూ, సర్కారులనుండి ఫ్రెంచివారిని వెళ్ళ గొడితే రాజమండ్రీఏలూరుకొండపల్లి సర్కారులు ఇస్తానని ప్రస్తావనచేశారు. కానీ, ఆంగ్లేయ కంపెనీ వారికి అప్పటిలో అంత సైనిక బలం లేకపోబట్టి వారు ఆ ప్రస్తావనకు వప్పుకోలేదు. మచిలీబందరు వారి స్వాధీనంలోనే వుండబట్టి కలకత్తాకు వచ్చే వారి ఓడలు ఇక్కడకుచ్చి మచిలీబందరులో లంగరు వెసేవి. 1762 జూలై మాసములో నిజాం అలీఖాం గారి తమ్ముడు బసాయత్ జంగ్ఆదోనీనుండి తన సైన్యాధిపతి కరీంఖాంను పంపి గుంటూరు సర్కారును ముట్టడించి స్వాధీనము చేసుకున్నాడు. ఆ సమయంలో సర్కారులను అప్పటిదాకా కౌలుకు తీసుకున్న హుసేనాలీ అను అతడితో మద్రాసులోనుండిన ఆంగ్లేయ కంపెనీ అధికారులు రాయబారం జరిపి సర్కారులను రక్షించటం చాల కష్టతరమైన పననియూ, ఆంగ్లేయ కంపెనీవారు ఆ బాధ్యతతీసు కుని రక్షణ చెేయుదరనీను అందకు ఫలీతముగా తమకు సర్కారులనుండి వచ్చేకరాయిదాలో సగం ఇవ్వవలసినదనీనూ సన్నదు (ప్రస్తావన) చేయగా హుసేనాలీ వప్పుకునగా మద్రాసునుండి కంపెనీ వారి మచిలీపట్టణం ముఖ్యసభ్యుడైన ఫెయర్ ఫీల్డు గారికి రాజమండ్రీలో తమ జండాని ఎగురవేయ మని ఆదేశం పంపిచారు. కానీ ఈ విషయం తెలిసిన నిజాం అలీఖాంగారు ఆ సన్నదు తనకు అంగీకరించనని తాకీదు పంపాడు. ఆసమయంలో మచిలీబందరుకు కొత్త ముఖ్యసభాపతిగా జాన్ ఫయిబస్ (John Phybus) దోరగారు పదవిలోకి రావటం, వారితో పాటు వారి దుభాషి జోగిపంతులు గారు రంగంలోకి ప్రవేశించటం జరిగింది. కానీ రాజమండ్రీలో పాతిన జండా తీసేస్తే ఇంగ్లీషువారి పరువు పోతుందని పైబస్ దొరగారు అలా చేయలేదు. అప్పడు నిజాం అలీఖాం గారి సైనికదళాధిపతిగానున్నబుడియా జమీన్ ఖాం 15-03-1763 న జోగిపంతులు గారితో రాయబారంచేసి ఇంగ్లీషువారిని రాజమండ్రీనుండి వదలివెళ్లమని ఇంగ్లీషు వారికి ఖర్చులక్రింద రూ 28700 నిచ్చెదమని ప్రస్తావనచేశాడు. అదేసమయంలో విజనగరంరాజా గారి సైన్యము వచ్చి రాజమండ్రీ ఆక్రమించాయి. బుడియాఖాం వారితో పోరాడలేక ఏలూరులో తలదాచుకున్నాడు.బీరారుదక్కనులో నున్న ఫ్రెంచివారిని వెళ్ళగొట్టమని 09-12-1763 న ఇంగ్లండునుండి చెన్నపట్టణంలో కంపెనీ అధికారులకు ఉత్తర్వులుచ్చినవి. 1764 లో కంపెనీవారు జోగిపంతులుని నిజాం అలీఖాం గారికి రాయబారం పంపిచారు. కానీ అతను తన తాకీదు ఉపసంహరించనన్నాడు. నిజాంతో మాట్లాడి లాభంలేదని కంపెనీవారు నిజాంగారి కౌల్దారైన హుసేనాలీతో రహస్యరాయబారాలు చేశారు. 24-03-1766 న ఇంగ్లీషు కంపెనీ వారి సేనానాయకుడైనకెప్టన్ హార్డును సైనికబలంతో సర్కారులను వశంచేసుకోటానికి మచిలీపట్టణానికి బయల్దేరాడు. దార్లో నున్నచల్లపల్లి జమీందారు కోట వదలిపోగా ఆ చల్లపల్లి కోటలో కెప్టన్ హార్డు ఆక్రమించి తదనంతరం రాజమండ్రీకి వెళ్లి అక్కడ విజయనగరంరాజా గారి సైన్యాన్ని తరిమిగొట్టారు. 12-11-1766 న జోగిపంతులుగారి ద్వారా నిజాం అలీఖాంగారితో జరిగిన వప్సందం ప్రకారము ఈస్టుఇండియా ఆంగ్లేయ కంపెనీ వారికి కప్పముచెల్లించు పధ్ధతిన సర్కారులను కౌలుకు ఇచ్చారు. ఈ చరిత్ర చాల విశేషమైనది.

బాపట్లలోని భావన్నారాయణస్వామి గుడి చాల పురాతనమైనది. ఆ గుడిలో భావన్నారాయణ స్వామివారి విగ్రహానికి ఎడమప్రక్కగా సోమేశ్వరస్వామి వారి విగ్రహం వుడేదట. జోగిపంతులు ఆ గుడిని బాగుచేయించి మరమ్మత్తులు చేయించి, సోమేశ్వస్వామివారి విగ్రహం వేరుచేసి, సోమేశ్వరస్వామివారికి వేరే గుడి కట్టించి స్వామి వారిని, లింగమును ప్రతిష్ఠించారనీ, తదుపరి (100 సంవత్సరములు తరువాత అయైయుండోచ్చు) ముక్త్యాలరాజా రాజాగారి సోదరడువాసిరెడ్డి వెంకటాద్రి నాయడుగారు (1843-1917) (వాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్ ) గారి తండ్రిగారు ఆ కొత్త గుడిధ్వజస్థంభం ప్రక్కనే కీర్తిధ్వజమును స్థాపించారనీ హిందూ వార్తపత్రికలో ప్రచురించినదాన్ని బట్టి తెలుస్తున్నది.

జోగిపంతులుగారు దుభాషీగా చాలా పలుకుబడి వుండటం వల్ల వారికి ధనసంపాదనతో పాటు అంహంకారంకూడా తెచ్చియుండొచ్చు. “జగపతిరాజు” అను బిరుదే నామధేయముగా ప్రసిధ్దిఅయి రాజమహేంద్రవరానికి తూర్పూగా 24 మైళ్ల దారుములోనున్న పెద్దాపుర సంస్ధానమును 1571 నుండి పరిపాలించుచున్న వత్సవాయి రాజవంశమువారిలో క్రీ.శ 1649 నుండి 1688 దాకా పరిపాలించిన సార్వభౌమ వత్సవాయి తిమ్మజగపతిరాజుగారు మన జోగిపంతులు గారి సమకాలీకులు. విద్యాపోషకులైన విద్వత్ తిమ్మజగపతిరాజుగారు కృష్ణాజిల్లాలోని మచిలీపట్టణంకు అప్పడప్పుడక్కడికి వచ్చి వుండేవారు. అందుకని మచిలీపట్టణంలో రాజుపేట అని ఒక పేట ప్రసిధ్ధి గాంచింది. ఒకసారి ఆ జగపతిరాజుగారు జోగిపంతులుగారిని కలుసుకోటానికి వారింటికి వెళ్ళినప్పుడు జోగిపంతులు గారు లోపల ఉన్నందున జగపతిరాజుగారు వారి కచ్చేరీలో తన స్థానంలో కూర్చునియుండిటం చూసిన జోగిపంతులు గారు వుగృడై పలుష వాక్కులు పలికి జగపతిరాజుగారినవమానిచటం జరింగింది. తత్ఫలితముగా పెద్దాపురం క్షత్రియవంశ రాజులే కాక అచ్చటి వెలమ రాజులు గూడా కలసి అప్పటి ఆంగ్ల పరిపాలకుడైన జాన్ పైబస్ గారి అనుమతితో ఆంగ్లము, హిందుస్తానీ చదువుకున్నవారైన తిమ్మజగపతిరాజుగారినే దుభాషిీగా చేశారు. జమీందారీ వ్యవహారాలన్నీ వీరే చేస్తూ మచిలీపట్టణంలోనే వుండూవుండేవారు. దాంతో జోగిపంతులు గారి దుభాషీ ఏకఛత్రాధిపత్యం అంతరించటమే గాక జమీందార్ల వ్యావహారలేమీ ఆయనదగ్గరకు వచ్చేవిగావు. ఆవిధంగా జోగిపంతులుగారి అహంకార పతనం జరిగింది. అక్కడితో పోక, జగపతిరాజు గారికీ వీరికీ తీరని వైషమ్యం ఏర్పడి ఒకరినొకరు హతమార్చే మంత్ర-తాంత్రికచర్యలుజరిగినవి.

జోగిపంతులు గారు చేసిన అమూల్య సేవలకు ఆంగ్ల కంపెనీ వారు దివిసీమలోని కొన్నిహవేలీ భూములును వీరికి జాగీరులుగా ఇచ్చారు. మచిలీపట్టణంలో వీరి భవంతి శతాబ్దాలతర్వాత దాకా కూడా “పంతులుగారిమేడ” అని ప్రసిధ్ధి గాంచి యుండేది. పంతులు గారి తదనంతరం వారి సోదరుడైన వెంకట్రాయలు గారు కూడా దుభాషీగా చేసి వారు గూడా 1776 లో హవేలీ భూములను 100 సంవత్సరములకు కవులకు తీసుకున్నారు. 1807 లో జోగిపంతులుగారి మనుమడు గోపాలరావు కూడా జాగీరులు పొందినవారిలో నున్నాడు. 1812 లో గోపాలరావు గారి చిన్న తమ్మడైన జగన్నాధరావు వారసుడైనాడు. 1836 లోఅతను చనిపోగా వారి భార్యకు వారసత్వం సంక్రమించింది. అప్పటినుండి 1853 మార్చి 25 తారీఖున వేలం వేయబడి కంపెనీ గవర్నమెంటువారే కొనుకునే దాకా ఆ జమీందారీ జోగిపంతులు గారి వారసులచే్తులలోనే వుండేది.

Leave a Reply