కర్బలా అమరులకు మంత్రిపేర్ని శ్రద్ధాఅంజలి….

0
703

ఇస్లాం మత పరిరక్షణకు కర్బలా మైదానంలో అమరులైన ఇమాం హుస్సేన్‌ కుటుంబ సభ్యులకు మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నివాళులర్పించారు.బార్‌ ఇమాం పంజా ను సోమవారం రాత్రి మంత్రి సందర్శించారు. ప్రభుత్వం పక్షాన ఆలంకి దట్టీ సమర్చించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఊరేగింపులో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ, ఇస్లాం మత పరిరక్షణ కోసం చివరి రక్త పుబొట్టు వరకు బలిదానం చేసిన మహనీయులను స్మరించుకుంటూ మంగళవారం నిర్వహించే చెస్ట్‌బీటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కోనేరు సెంటర్‌లో అనాదిగా జరిగే కార్యక్రమానికి ఊరేగింపుగా వచ్చే ముస్లింలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు వహించామన్నారు. ఈకార్యక్రమంలో నిలార్‌దాదా, అచ్చాబా, అజర్‌, అన్వర్‌హుస్సేన్‌, ఇనాయత్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply