కరాటేలో ప్రతిభ చూపిన బందరు విద్యార్థులు..

0
753

ఈ నెల 8న ఆమరావతి రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో నిర్వహించిన నేషనల్‌ ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్ 2019 పోటీల్లో కేవీఆర్‌ పార్కులో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు. కటా, పైట్‌, టీమ్‌ కటా విభాగాల్లో స్వర్హ,రజత, కాంస్య పతకాలను సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం పార్కు ఆవరణలో విద్యార్థులను అభినందించి సత్కరించారు. కటా విభాగంలో సమయం రోహిత్‌సాయి, ఎన్‌.చరణ్‌, కె.నిహార్‌,సమయం ఈశ్వర్‌ ఆనంద్‌సాయి, డి. ప్రణశ్యతి స్వర్ణం, ఎల్‌. ధనుత్రీ, ఎ. షాహీన, బి. మౌనిభాగ్యశ్రీ రజత పతకాలు సాధించారు. ఫైట్‌ విభాగంలో సమయం ఈశ్వర్‌ ఆనంద్‌సాయి, ఎల్‌. ధనుశ్రీ, డి.ప్రణశ్యతి, బి.మౌనిభాగ్యశ్రీ స్వర్ణం, కె.నిహార్‌,ఎన్‌.చరణ్‌ రజత, కాంస్య పతకాలు గెలుపొందారు. టీమ్‌ కటా విభాగంలో సమయం రోహిత్‌ సాయి, ఎన్‌. చరణ్‌, సమయం ఈశ్వర్‌ ఆనంద్‌సాయి బంగారు, ఎల్‌.ధనుశ్రీ, డి.ప్రణశ్యతి, ఎ. షాహీన రజతం, కె.నిహార్‌, జె.దత్తు, ఎ. అఖిల్‌ కాంస్య పతకాలు సాధించారు. వీరిని పలు
వురు ప్రముఖులు అభినందించారు.
Leave a Reply