ఒక్కొక్కరికీ 3 మాస్కులు..

0
750

కరోనా మహమ్మారి నుంచి ప్రజల రక్షణ కోసం రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ మాస్కులు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అందజేయనుంది.

ఒక్కొక్కరికీ 3 మాస్కుల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 16 కోట్ల మాస్కులు ఇవ్వనున్నారు.

వీటి తయారీ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అందజేశారు.

మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన మాస్క్‌లను ముఖ్యమంత్రి జగన్‌ పరిశీలించారు.

ఇప్పటికే 7 లక్షలకు పైగా తయారు చేసిన మాస్కులను నేటి నుంచి ప్రజలకు పంపిణీ చేయనున్నారు.

ముందుగా రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో వీటిని అందజేయనున్నారు. మరో 4, 5 రోజుల్లో రోజుకి 30 లక్షల చొప్పున మాస్కుల తయారీకి సన్నద్ధమవుతున్నారు.

16 కోట్ల మాస్కుల తయారీకి దాదాపు కోటీ 50 లక్షల మీటర్లుకు పైగా వస్త్రం అవసరం కానుంది.

ఇప్పటికే 20 లక్షల మీటర్లకు పైగా వస్త్రాన్ని ఆప్కో నుంచి సేకరించారు.

మిగిలిన వస్త్రం సైతం వీలైనంత త్వరగా ఇచ్చేందుకు ఆప్కో సిద్ధంగా ఉంది.

స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 40 వేల మంది టైలర్లు నిరంతరం మాస్కుల తయారీలో నిమగ్నమై ఉన్నారు.

ఒక్కో మాస్కు తయారీకి 3 రూపాయల 50 పైసల చొప్పున మహిళలు రోజుకు 500 రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

లాక్‌డౌన్‌తో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు మాస్కుల తయారీతో ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.

తొలుత రెడ్‌జోన్లలో పంపిణీ ప్రారంభించి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మాస్కులు అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here