ఐదుగురు ఆటగాళ్లకు గంగూలీ ఛాన్స్..

0
743

బంగ్లాదేశ్ వేదికగా మరో క్రీడా సంగ్రామం జరుగనుంది… అవును ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయి.. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శత జయంతిని పురస్కరించుకుని ఈ మ్యాచ్ లు నిర్వహిస్తోంది.

మరోవైపు ఐసీసీ ఈ మ్యాచ్ లను అధికారికంగా గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా జట్టులో ఆడే క్రికెటర్లలో పాక్ ఆటగాళ్లు ఉండే అవకాశంలేదని తెలుస్తోంది. ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో.. ఆసియా ఎలెవన్ జట్టులో ఈ రెండు జట్ల ఆటగాళ్లు కలిసి ఆడే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ కూడా అదే చెబుతోంది. ఈ జట్టు నుంచి పాక్ ఆటగాళ్లు కలిసి ఆడరు అని చెబుతోంది.

ఆసియా ఎలెవన్ జట్టులో ఆడే ఐదుగురు ఆటగాళ్లను బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఎంపిక చేస్తారు. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే జట్టులో ఉండి ఒక్క ఓవర్ కూడా ఆడే అవకాశం లేదు అని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply