చివరి ఓవర్‌లో మ్యాజిక్ చేసి మ్యాచ్‌ను టై చేసిన షమీ
కివీస్ సారథి కేన్ విలియమ్సన్ పోరాటం వృథా
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ‘సూపర్’ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం కోహ్లి సేననే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగల వద్దే నిలిచింది. దీంతో ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ విజేత సూపర్ ఓవర్‌తో తేలింది.
సూపర్ ఓవర్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 17 పరుగులు చేసింది. బుమ్రా బౌలింగ్ చేయగా, విలియమ్సన్, గప్టిల్‌లు బ్యాటింగ్ చేశారు. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు రోహిత్, రాహుల్‌లు జట్టుకు విజయాన్ని అందించారు. టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్ రెండు సిక్సర్లు కొట్టగా, రాహుల్ ఓ ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది. సూపర్ ఓవర్‌లో టీమిండియాకు సూపర్ విజయాన్ని అందించిన రోహిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
