ఈ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి కరోనావైరస్ గురించి క్షణాల్లో తెలుసుకోండి ఇలా..

0
931

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక చర్యలను చేపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విద్యా సంస్థలను, సినీ థియేటర్లను, షాపింగ్ మాల్స్ ని, దేవాలయాలను మార్చి 31వ తేదీ వరకు మూసివేశారు. అలాగే ప్రతి ఒక్క రాజకీయ నేత సామాజిక మాధ్యమాలలో కరోనా వైరస్ గురించి జరుగుతున్న ప్రచారం లో 90% వరకు తప్పుడు సమాచారం ఉంటుందని ప్రజలకు తెలియజేస్తున్నారు.

అది కాకుండా కరోనా వైరస్ గురించి నిజమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసినందుకు భారత ప్రభుత్వం ఒక వాట్సాప్ హెల్ప్ డెస్క్ ని కూడా ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా మీరు వాట్సాప్ లోనే కరోనా వైరస్ గురించి సమస్త సమాచారం తెలుసుకోవచ్చు. అందుకుగాను మీరు చేయాల్సిందల్లా… 9013151515 ఫోన్ నెంబర్ ని మీ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేసుకోవడమే. ఒక్కసారి సేవ్ చేసుకున్న తరువాత వాట్సాప్ ఓపెన్ చేసి సేవ్ చేసుకున్న నెంబర్ (9013151515)కు ఏదైనా ఒక మెసేజ్ చేయండి.

అలా చేసిన వెంటనే ‘నమస్తే! మీకు అవగాహన కల్పించి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కరోనావైరస్ (COVID-19) హెల్ప్‌డెస్క్. ఏదైనా అత్యవసర పరిస్థితి కోసం హెల్ప్‌లైన్: 011-23978046, టోల్ ఫ్రీ నంబర్: 1075 నెంబర్లను సంప్రదించండి’ అంటూ ఒక మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, కరోనా వైరస్ వచ్చిన తర్వాత లక్షణాలను, ఇంకా ఇలాంటి సమాచారం హెల్ప్ డెస్క్ ద్వారా అందుతుంది.

ఇకపోతే మార్చి 22 అనగా ఆదివారం రోజు పొద్దున్న 7 గంటల నుండి రాత్రి 9 వరకు ఇంటి నుండి బయటకు రాకుండా ఒక జనతా కర్ఫ్యూ ని దేశ ప్రజలంతా పాటించాలని మోడీ గురువారం సాయంత్రం విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here