ఇండోర్ లో నేడే రెండో టీ-20

0
717
  • అచ్చొచ్చిన గ్రౌండ్లో తిరుగులేని భారత్ :- భారత్- శ్రీలంక జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ రెండో ఆటకు ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. గౌహతీ వేదికగా జరగాల్సిన తొలిమ్యాచ్ వానదెబ్బతో రద్దు కావడంతో.సిరీస్ లోని ఈ రెండోమ్యాచ్ కీలకంగామారింది.భారీస్కోరింగ్ మ్యాచ్ లకు మరోపేరుగా నిలిచిన ఇండోర్ వేదికగా భారత్ కు తిరుగులేని రికార్డే ఉంది. భారత విజయాల గ్రౌండ్ గా పేరుపొందిన హోల్కార్ స్టేడియంలో మరోసారి పరుగుల మోత మోగే అవకాశం ఉంది.

భారత్ కు 8-0 రికార్డు:-హోల్కార్ స్టేడియం వేదికగా 2006 నుంచి భారత్ వివిధ ఫార్మాట్లలో ఆడిన ఎనిమిదికి ఎనిమిది మ్యాచ్ ల్లోనూ విజేతగా నిలిచింది. ఇందులో రెండుటెస్టులు, 5 వన్డేలు, 2017 సీజన్లో శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన ఓ టీ-20 మ్యాచ్ ఉన్నాయి.లాసిత్ మలింగ నాయకత్వంలోని శ్రీలంకజట్టు పలువురు యువఆటగాళ్లతో కూడిన జట్టుతో పోటీకి దిగుతుంటే.5వ ర్యాంకర్ భారత్ మాత్రం..వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ లేకుండా సమరానికి సిద్ధమయ్యింది.

ధావన్, బుమ్రా రీ-ఎంట్రీ :- సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా.గాయాల నుంచి పూర్తిగా కోలుకొని..ఇండోర్ మ్యాచ్ ద్వారా పునరాగమనం చేయబోతున్నారు.రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో టాస్ అంతంత మాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది. రెండుఇన్నింగ్స్ లోనూ పిచ్ బ్యాటింగ్ కు అనువుగా ఉండే అవకాశం ఉండడంతో టాస్ ప్రభావం నామమాత్రమేనని భావిస్తున్నారు.

2020 ప్రపంచకప్ కు సన్నాహకంగా భారత్ ఆడనున్న మొత్తం 15 సన్నాహక మ్యాచ్ ల్లో.ఇప్పటికే ఓ మ్యాచ్ వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిపోయింది. ఇక..14 మ్యాచ్ లు మాత్రమే మిగిలిఉన్నాయి.మ్యాచ్ వేదిక హోల్కార్ స్టేడియంలోని మొత్తం 27వేల టికెట్లు విక్రయమైనట్లు మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం ప్రకటించింది.

Leave a Reply