మచిలీపట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల సిబ్బంది వాళ్ళు అనుసరిస్తున్న బాధ్యతారాహిత్య విధానం నిర్లక్ష్యం కారణంగా శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వివిధ రకాల రోగులు,గర్భిణులు ఇన్ఫెక్షన్ సోకి అనారోగ్యం పాలవుతున్నారు.ఇందుకు కారణం ఆపరేషన్ థియేటర్ లో వాడుతున్న పాతకాలపు తుప్పుపట్టిన మరమ్మతులకు గురిఅయిన పరికరాలు,అపరిశుభ్ర వాతావరణం,సిబ్బంది నిర్లక్ష్యం,వైద్యుల,అధికారుల పర్యవేక్షణా లోపం ప్రధానంగా స్పష్టమవుతున్నది.ప్రజలను ఆరోగ్యవంతులుగా చికిత్స చేసి పంపవలసిన వైద్యశాల ఆయా ప్రజల పాలిట అనారోగ్యాలు ప్రసాదించే ప్రదేశంగా విశిష్టమవుతున్నది.కాగా బందరు పెద్దాసుపత్రికి ప్రతి రోజవివిధ రకాల మైనర్, మేజర్ అపరేషన్లు నిర్వహించబడుతున్నాయి ఇందుకు గాను మైనర్, మేజర్ అపరేషన్ ధియేటర్లు ఆసువత్రి ప్రాంగణంలో ఉన్నాయి. అయితే అందులో ఉండాల్సిన సంబందిత అదునాతన పరికరాలు మాయమైపోతున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కమిటీ ఆసుపత్రి నిధుల పేరుతో ప్రతియేటా ఆధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు రికార్డులలో చూపించినప్పటికి ఆయా పరికరాలు ఆపరేషన్ థియేటర్లలో కనిపించకపోవడం గమనార్హం.
