సైన్స్ ఫెయిర్ సందర్భంగా పలు ప్రాంతాలనుండి వచ్చిన చిన్నారులు వారి వారి సృజనాత్మకతను వెలికి తీశారు.మచిలీపట్టణం, నూజివీడు,నాగాయలంక,జగ్గయ్యపేట,మాగల్లు స్కూల్ విద్యార్థులు చేసిన పలు యంత్రాలు చుపురులను ఆకట్టుకున్నాయి.మన మచిలీపట్టణం నుండి బాలాజీ విద్యాలయాల,కేంద్రియవిద్యాలయం నుండి వచ్చిన చిన్నారులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ట్రాఫిక్ వ్యవస్థ ఎలా మెరుగుపరచాలో వివరించారు… కాయిన్ వేయగానే చాక్లెట్ వచ్చే యంత్రాన్నిరూపొందించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను కనిపెట్టారు.. మెదడు పనిచేసే తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. నీటి పారుదల ప్రాజెక్టులు, మానవ శరీర రసాయనాల వినియోగం,పట్టణాలు, ఇలా ఎన్నో 1 ఎన్నెన్నో చిన్నారుల సృజనాత్మకకు దర్చణం పట్టాయి. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలు పాఠశాలల్లో జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో చిన్నారులు ప్రదర్శించిన ఎక్సిబిట్లు ఆకట్టుకున్నాయి.


