ఆంగ్ల మధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85 ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు…

0
652

ఇక్కడ చాలా మంది వ్యతిరేకించింది ‘తెలుగు మధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మధ్యమాన్ని తప్పనిసరి చేయడం’ గురించే. దానికి వారు యథావిధిగా వక్రీకరించి తమ కుసంస్కారంతో విమర్శలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ మభ్యపెట్టినా కూడా నిజాన్ని, చట్టాన్ని మార్చలేవు, ఏ మాధ్యమంలో చదువుకోవాలి అనేది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులుకు వదిలేయండి.

ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించే వారి వాదన ప్రకారం ఎవరైనా ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటారని. అలా కోరుకుంటే అలానే బోధించేందుకు ఏర్పాట్లు చేయండి కానీ తెలుగు మాధ్యమంలో చదవాలని కోరుకుంటే ఖచ్చితంగా తెలుగు లో బోధించి తీరాల్సిందే. ప్రస్తుతానికి కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మాధ్యమాల్లో బోధిస్తున్నారు. అవసరం అనుకుంటే అన్ని పాఠశాలల్లో అదే విధంగా ఏర్పాట్లు చేయండి తప్ప తెలుగు మధ్యమాన్ని రద్దు చేయకండి.

Leave a Reply