రంగం ఏదైనా పురుషులతో సమానంగా మహిళలు దూసుకుపోతున్నారు. తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే పురుషులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని చాటుకోడానికి తహతహలాడుతున్నారు.క్రికెట్లో పురుషులతో సమానంగా మహిళలకు సైతం అవకాశాలు కల్పించాలన్న ఐసీసీ వ్యూహంలో భాగంగా.సమర్థులు, ప్రతిభావంతులైన మాజీ మహిళా క్రికెటర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న పట్టుదలతో ఉంది.అందులో భాగంగానే మహిళలను సైతం మ్యాచ్ రిఫరీలుగా నియమిస్తోంది. ఐసీసీ గతంలో ప్రకటించిన మ్యాచ్ రిఫరీల జాబితాలో చోటు సంపాదించిన ఆంధ్ర మాజీ క్రికెటర్ జీఎస్ లక్ష్మి .పురుషుల టీ-20 మ్యాచ్ ల్లో మ్యాచ్ రిఫరీగా సేవలు అందించించి.ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఎంపికైన భారత తొలి మహిళ ఘనతను ఓ ఆంధ్ర క్రికెటర్ దక్కించుకోడానికి తెలుగురాష్ట్రాల మహిళలకు దక్కిన అరుదైన గౌరవంగా మిగిలిపోతుంది.51 సంవత్సరాల లక్ష్మికి క్రికెటర్ గా, అంపైర్ గా, మ్యాచ్ రిఫరీగా అపార అనుభవం ఉంది. 1986 నుంచి 2004 వరకూ ఆంధ్ర, సౌత్ సెంట్రల్ రైల్వే, బీహార్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లకు ఆల్ రౌండర్ గా ఆడిన రికార్డు లక్ష్మికి మాత్రమే సొంతం.
అవుట్ స్వింగ్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా సుదీర్ఘ కెరియర్ కొనసాగించిన లక్ష్మి.రిటైర్మెంట్ తర్వాత.మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు చేపట్టింది.2008-09 సీజన్లో భారత దేశవాళీ క్రికెట్లో తొలిసారిగా మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించింది.అంతర్జాతీయ స్థాయిలో మహిళల మూడువన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లకు మ్యాచ్ రిఫరీగా సేవలు అందించడం ద్వారా ఐసీసీ గుర్తింపు సంపాదించింది.
