వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు చేర్చడంపై కేంద్రం మార్గదర్శకాలు జారీ..

0
447

కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను స్వస్థలాలకు తరలించడంపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
అన్ని రాష్ట్రాలకు నోడల్‌ అధికారులను నియమించాలని ఆదేశించింది. వారి తరలింపుపై రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారానికి రావాలని సూచించింది.
అందరికీ పరీక్షలు చేసిన తర్వాతే అనుమతించాలంది. బస్సుల్లో తరలించేటప్పుడు భౌతికదూరం పాటించడంతో పాటు బస్సులను శానిటైజ్‌ చేసి నిబంధనలు పాటించాలని ఆదేశించింది.

Leave a Reply