నేటి నుండి మూడోవిడత రేషన్ పంపిణి…

0
83

మే నెల మొదటి విడత రేషన్‌ పంపిణీని పౌరసరఫరాల శాఖ నేటినుండి ప్రారంభిస్తోంది.

ఈనెల 29 నుంచి మే 10వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేస్తారు.

గత రెండు విడతల తరహాలోనే సరుకులు ఉచితంగా ఇవ్వనున్నారు.

గత పంపిణీలో కందిపప్పునకు బదులుగా శనగలు ఇవ్వగా, ఈసారి మళ్లీ కార్డుకు కిలో చొప్పున కందిపప్పు ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో ఒక కోటీ 47 లక్షలకు పైగా కార్డులుంటే ఇటీవల కార్డులకు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన 81 వేల కుటుంబాలకు కూడా ఈ విడతలో రేషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

గత రెండు విడతల్లో కార్డుదారులకు బదులుగా వీఆర్‌వోలే వేలిముద్రలు వేశారు.

కానీ, ఈసారి కార్డుదారులు వేలిముద్ర వేస్తేనే రేషన్‌ ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల వల్లే వేలిముద్రను తప్పనిసరి చేయాల్సి వచ్చిందని ఆ శాఖ చెబుతోంది.

కాగా, గత రెండు విడతల్లో లేని నిబంధనలు ఈసారే గుర్తొచ్చాయా అని కార్డుదారులు, డీలర్లు ప్రశ్నిస్తున్నారు.

రేషన్‌ కోసం ఒకేసారి షాపులకు రావొద్దని అధికారులు కోరారు.

స్లిప్పులు పంపిణీ చేస్తామని, వాటిలో సూచించిన తేదీ, సమయానికి రావాలని కోరారు.

రేషన్‌ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

ఒక్కో షాపు లేదా కౌంటర్‌లో రోజుకు 30 నుంచి 40 మందికి మాత్రమే సరుకులు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. 

వేలిముద్రలు వేసే ముందు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

పోర్టబులిటీలో కూడా వెంటనే సరుకులు పొందవచ్చన్నారు.

Leave a Reply