0
299

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని 7 రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.

మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు (చెన్నై)ల నుంచి వచ్చినవారి నమూనాలను రైల్వే స్టేషన్లలోనే సేకరించాలని సూచించింది.

అనంతరం వారిని ప్రభుత్వ క్వారంటైన్‌లో 7 రోజులు, హోం క్వారంటైన్‌లో మరో 7 రోజులు ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఈ రాష్ట్రాల నుంచి వచ్చేవారిలో 60 ఏళ్లు దాటిన వారికి, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, తీవ్ర అనారోగ్యాలతో బాధపడేవారికి మినహాయింపునిచ్చింది.

వీరు తప్పనిసరిగా ఇళ్లలో 14 రోజుల పాటు ఉండేలా చూడాలంది.

ప్రభుత్వాధికారులు, వ్యాపారులు, వైద్య నిపుణులకు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల నుంచి మినహాయింపునిచ్చింది.

Leave a Reply