మరోసారి మానవత్వం చాటుకున్న మహా స్నేహశీలి జిల్లా ఎస్పీ…

0
358

మచిలీపట్నం మండలం పొలాటితిప్ప గ్రామమునకు చెందిన మోకా కార్తికేయ 4 సం బాలుడు S/O మోకా నాగరాజు సంవత్సర కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ ఉండగా 14 తేదీ ఒక్కసారిగా క్యాన్సర్ వ్యాధి(ల్యుకేమియా) కణాలు అన్యుహ్యంగా పెరిగిపోవడంతో బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిపోయింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో జాయిన్ చేయటానికి ఈ పాస్ కోసం కృష్ణ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు గారికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా, సమాచారం తెలుసుకున్న ఎస్పీ గారు క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా క్షణాల వ్యవధిలో హైదరాబాద్ వెళ్లడానికి మార్గం సుగమం చేసి బాబు ను హాస్పిటల్ చేర్చే వరకు అనుక్షణం చర వాణి ద్వారా పర్యవేక్షిస్తూ బాబు ఆరోగ్య పరిస్థితిని నిరంతర తెలుసుకుంటూ ఉన్నారు.
బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మానవీయ కోణంలో ఆ బాలుడికి తక్షణ వైద్య సహాయం అందించడానికి అనుమతి ఇచ్చి మార్గం సుగమం చేసిన ఎస్పీ గారికి ఆ కుటుంబం కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply