అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామంలో నిన్న రాత్రి భారీ పేలుడు

0
438

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామంలో నిన్న రాత్రి భారీ పేలుడు సంభవించింది. గ్రామానికి చెందిన తుంగల దిలీప్ పశువుల పాక నుంచి రాత్రి భారీ పేలుడు శబ్దం వినిపించింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇది వినిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమీపంలోని పలు ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై పరిశీలించారు . పశువుల పాకలోని బస్తాల వద్ద పేలుడు జరిగిందని, సోడియం నైట్రేట్, అమోనియంలను నిల్వ ఉంచడం వల్ల ఒత్తిడికి గురై పేలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply