HAPPY BIRTHDAY MOTHER

0
426

పుట్టిన ప్రతి మనిషికి మాతృమూర్తి ఒకరే వుంటారు. కానీ… ప్రపంచం అందరికి మాతృమూర్తిగా ప్రసిద్ధి చెంది ఘనత వహించిన ఒకరే వున్నారు.కన్నతల్లి రోడ్లపాలు చేసినపుడు వారిని తస వెచ్చని ఒడిలోకి చేర్చుకున్నదిఆ స్తీ మూర్తి. ఈమె అందరికి “అమ్మ దైవం పంపిన ‘తల్లి. ఆమె మరెవరోకాదు దీనులమాత మదర్‌ థెరిసా. థెరిసా’ ఈ పేరు విననివారు ప్రపంచంలో బహు అరుదుగా వుండివుంటారు. అటువంటి తల్లి మనసులో ‘మన’ పట్ల గల భావాలు ఆమె మాటల్లోతెలుసుకుందాం.ఆమె మనందరి కోసం చేసింది ‘త్యాగం.’అది “జీవిత త్యాగం’.అది మరి ఆమెకు కష్టం కాలేదా?…కానే కాలేదు. ఎందుకంటే ఏ మనిషి ప్రపంచంలో మరోమనిషిని నిస్వార్ధంగా పేమించలేడు. అది కేవలం దైవం వల్ల మాత్రమే సాధ్యము. మదర్‌గాని లేదా ఆమెతోపాటు వున్న సేవికలు గానీ తమను దేవుని పరం చేసుకున్నారు. దేవునికి అర్చించుకున్నారు. అందుచేత వారికి నిస్వార్థత అలవడింది. ఆ నిస్వార్ధంనుండే స్వచ్చమైన మనసు ఏర్పడింది. దానితోనే ఇతరులకు సేవ చేయగలిగారు. అది వారి మనసులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆనందం కలిగించే జీవితం త్యాగం చేయడం వల్ల వచ్చిందని ఎవరనుకుంటారు. అటువంటపుడు ఆ జీవితం కష్టమెందుకు అవుతుంది?

Leave a Reply