తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఉన్న వాయుగుండం మంగళవారం తుఫాన్‌(నిసర్గ)గా మారింది.

0
374

తూర్పుమధ్య అరేబియా సముద్రంలో ఉన్న వాయుగుండం మంగళవారం తుఫాన్‌(నిసర్గ)గా మారింది.

ఇది మధ్యాహ్నానికి ముంబైకి 380 కిలోమీటర్ల దక్షిణ నైరుతిగా కేంద్రీకృతమై ఉంది.

ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారనుంది.

ఈ క్రమంలో కొంత సమయం ఉత్తరంగా తరువాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనించి బుధవారం మధ్యాహ్నం ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని అలీబాగ్‌కు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆ సమయంలో గంటకు 110- 120కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.

తుఫాన్‌ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని పేర్కొంది.

కాగా ఈనెల 8 లేదా 9న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

దీని ప్రభావంతో రుతుపవనాలు ఏపీలో ప్రవేశిస్తాయని అంచనా వేశారు.

Leave a Reply