ఆగస్ట్ 3న కరోనా వాక్సిన్ రిలీజ్..!ప్రకటన చేసిన రష్యా హెల్త్ మినిస్టర్

0
780

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి.. రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతు న్నాయని ఆయన తెలిపారు.సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటు లోకి తెస్తామని చెప్పారు. సెచెనోవ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఇప్పటికే తొలి రెండు దశల క్లినియల్‌ ట్రయల్స్‌ విజయ వంతంగా పూర్తైనట్లు తెలిపారు.

తొలి వ్యాక్సిన్​..!

అన్ని సక్రమంగా జరిగినట్లయితే… ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్‌ నిలవనుంది.

ఈ ఏడాది దేశీయంగా 3 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ప్రకటించింది.

మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది.

వ్యాక్సిన్‌ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపినట్లు రష్యా వెల్లడించింది.

Leave a Reply