6న మచిలీపట్నంలో ఉద్యోగ మేళ

0
669

ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 6వ తేదీన స్కిల్‌ కనెక్ట్‌ డైవ్‌ నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజరు ప్రశాంత్‌ తెలిపారు. బుట్టాయిపేటలోని విజయానంద డిగ్రీ కళాశాలలో సోమవారం ఉదయం 8.30
గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు. ఏజీఎస్‌ గ్లోబల్ సొల్యూషన్స్‌,
యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ కార్ట్‌, నెక్యూర్‌ వాల్యూ, రిలయన్స్‌ డిజిటల్స్‌ కంపెనీల ప్రతిని
ధులు హాజరవుతారని, పది, ఇంటర్‌, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొ
న్నారు. ఎంప్మికైనవారు కస్టమర్‌ రిలేషన్‌షిప్‌, షోరూం సేల్స్‌, స్టోర్‌ ఎగ్జిక్యూటివ్స్‌, క్యాషి
యర్స్‌, సేల్స్‌ఆఫీసర్స్‌గా మచిలీపట్నం, గుడివాడ, విజయవాడల్లోని ఆయా కంపెనీల్లో సేవ
లందించాల్సి ఉంటుందని తెలిపారు. వేతనం నెలకు రూ.9వేల నుంచి రూ.20వేల వరకు
అందుకోవచ్చని అర్హత, ఆసక్తి కలిగినవారు సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరా
లకు 1800 425 2422 సంప్రదించాలని బుధవారం ఓ ప్రకటనలో కోరారు.


Leave a Reply