22 కోట్ల రూ.. ల ఫిల్టరైజేషన్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేసిన మంత్రి పేర్ని నాని

0
315

వచ్చే జులై రెండవ వారం నుంచి ప్రతి రోజూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు.


శుక్రవారం ఉదయం ఆయన మచిలీపట్నం గొడుగుపేట కేశవరావు తోట ప్రాంతంలో 22 కోట్ల రూపాయల అమృత నిధులతో నిర్మించిన ఫిల్టరైజేషన్ ప్లాంట్ కు నిరాడంబరంగా ప్రారంభోత్సవం చేశారు. 22 మిలియన్ లీటర్ల నీటిని నిత్యం సుద్ధి చేసే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ , అమృత పథకం పనులు చాలా నత్తనడకన సాగాయని తానూ గత ఏడెనిమిది నెలలుగా కాంట్రాక్టర్ ను , ఇంజినీర్లను , డిపార్మెంట్ ను పరుగుపెట్టించడంతో తానూ అంచనా వేసిన దానికన్నా వారం రోజుల ముందుగానే ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ను వినియోగంలోనికి తీసుకువచ్చి ఈ వేసవికి పట్టణ ప్రజలకు ఆందునాటులోనికి జయప్రదంగా తీసుకురాగలిగేమని మంత్రి తెలిపారు. దీంతో పాటు 16 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్ధ్యం గల పాత ఫిల్టర్లు సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలియచేస్తూ , ఈ రెండిటిని ఏకకాలంలో ఉపయోగిస్తే , కాలువలు వచ్చేసరికి మంచినీళ్ల చెరువు అడుగు అంచు భాగానికి చేరుకొనే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.

జులై మొదటివారంలో కాలువలకు తాగునీళ్లు వస్తే , సమస్య ఉత్పన్నం కాదని ఒక వేళ రుతుపవనాలు ఆలస్యమై గోదావరీ పరివాహక ప్రాంతాలలో గత ఏడాది మాదిరిగా వర్షాలు కురవకపోతే, కాలువలు రాని పక్షంలో మంచినీటి చెరువులో నీటి మట్టాలు తగ్గిపోతాయని ప్రజలు ఇబ్బంది పడతారేమోననన్న దూరదృష్టితో ప్రస్తుతానికి రోజూ తాగునీరు ఇవ్వడం లేదన్నారు. మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలందరికి ప్రతిరోజూ సమృద్ధిగా స్వచ్ఛమైన తాగునీరు మరికొద్ది వారాలలో గంటసేపు సరఫరా చేసేందుకు సంసిద్దమవుతున్నట్లు తెలిపారు. అలాగే సమీప భవిష్యత్తులో మోటార్ సహాయం అవసరం లేకుండా ఎంతో వత్తిడితో నీరు కుళాయిలలో రానున్నట్లు చెప్పారు. అన్ని వార్డులలో మరిన్ని నూతన రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు 25 కోట్ల రూపాయల అంచనాలతో ప్రణాళికలు రూపొందించి ముఖ్యమంత్రిక వద్దకు తీసుకెళ్లి వచ్చే ఏడాదికి మంజూరు చేయించనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.


నిర్ణీత సమయానికన్నా ముందే పనులు వేగవంతంగా సమర్థవంతంగా పూర్తి చేసినందుకు మంత్రి పేర్ని నాని ఇంజినీర్లకు , అధికారులకు, సిబ్బందికి ఒక్కొక్కరికి డజను డజను బంగినపల్లి మామిడిపండ్లు చొప్పున మర్యాదపూర్వకంగా అందజేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ కమీషనర్ శివరామకృష్ణ , మునిసిపల్ ఇంజినీర్ త్రినాధ్ బాబు, హెల్త్ డి ఇ రామ్ ప్రసాద్, ఎలెక్ట్రికల్ ఏ ఇ సాయి ప్రసాద్, అసిస్టెంట్ ఇంజీనీర్లు పిల్లి ప్రసాద్, వర ప్రసాద్ , ఏ సి పి నాగ శాస్త్రులు , టౌన్ ప్లానింగ్ అధికారి రాజా బాబు , వాటర్ వర్క్స్ ఫిట్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
——————-ఉప సంచాలకులు , కృష్ణాజిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ మచిలీపట్నం వారిచే జారీ చేయబడింది.

Leave a Reply