శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు–బందరు

0
495

 శ్రీ ముదునూరు వెంకటేశ్వర రావు గారు తమ జీవిత చరిత్ర ను ”మహాత్ముల బాట లో ”అన్న పేర రాశారు ఇక్కడే కనపడు తుంది ఆయన ఆదర్శం ఏమిటో ,వినయ భంగిమ ఏమిటో .ఈ పుస్తకం ఆధారం గానే నా రచన సాగుతుంది .విద్యార్ధిగా ,యువకునిగా ,ఉపాధ్యాయునిగా ,అధ్యాపకునిగా ,విశ్రాంత జీవిగా ,ఆయన జీవించిన ,జీవిస్తున్న ,విధానం ,ఆ యా దశల్లో చేసిన సాహిత్య సేవ ,నడిపిన పత్రికలు ,సమాజ సేవ అన్నీ వివరంగా విన్న విస్తాను .                                             కృష్ణా జిల్లా ముదునూరు లో జన్మించిన వెంకటేశ్వర రావు గారు ,చిన్న  తనం లోనే ,వాళ్ల స్వగ్రామం లో మహాత్మా గాంధి జీ ని చూచే మహద్భాగ్యం పొందారు .ఆయన ప్రభావం బాగా పని చేసింది .అప్పటినుంచే అస్పృశ్యతను ఏవగించుకున్నారు .హరిజనోద్ధరణ చేయాలని సంకల్పించారు .ప్రైవేటు స్కూల్ లోనే ప్రాధమిక విద్య పూర్తి చేసి,బందరు లో శ్రీ రామా హై స్కూల్ లో చేరారు .ఆనాటి ఉపాధ్యాయులంతా క్రమ శిక్షణకు మారు పేరు గా వుండే వారు .స్కూల్ లోనే విద్యార్ధులకు పాఠాలన్నీ వచ్చే టట్లు బోధించే వారు .ఇంటి వద్ద విద్యార్ధికి ఇంకా ఏమి పని వుండేది కాదు .ఆ విధానం రావు గారిని బాగా  ఆకర్షించింది .మునిమాణిక్యం నరసింహా రావు హిస్టరీ మేష్టారు .1937 లో శ్రీమతి సరోజినీ నాయుడు బందరు విచ్చేశారు .ఆమె ఉపన్యాసం విని ఉప్పొంగి పోయి గొప్ప ప్రేరణ పొందారు .ఆమె వాగ్దోరని ,ప్రసన్న హృదయం నచ్చింది .రావు గారి తల్లి గారు చేసే రామ నామం ఆయనకు చాలా ఇష్టం .తండ్రి  గారు ఆదిత్య హృదయం నేర్పారు .మొదటిది ముక్తికి ,రెండోది ఆరోగ్యానికి అవసర మైనవి .చిన్నప్పటి నుంచి జేబు లో పాకెట్ నోట్ బుక్ వుండేది .గమనించిన ముఖ్య విషయాలు అందులోవెంటనే   రాసు కొనే వారు అది వారికి ఎన్నో రచనలు చేయటానికి దోహదం చేసింది ..మునిపల్లె రామా రావు గారి ద్వారా కమ్యునిస్ట్ పార్టి కి దగ్గరయారు .పార్టి వీరికి కొన్ని కార్య క్రమాలు అప్పగించింది .పోలీసులు వెంట బడితే కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకొనే వారు .మినర్వా టాకీస్ లో ఒక సారి కర పత్రాలను పంచి ,అందకుండా పారి పోయారు ..poleesula     పోలీsula   interogation  ఇన్  లో ఆకుకు అందాకా ,పోకకు పొందక సమాధానాలు చెప్పి ,హెడ్ మాస్టర్ గారి అభిమానం తో బయట పడ్డారు .క్రమం గా పార్టీ కార్య క్రమాలకు దూరమై ,చాడువుమ్మీద శ్రద్ధ పెట్టి ,సాంస్కృతిక కార్య క్రమాలకే పరిమితమయారు .                ప్రముఖ నాస్తిక ప్రచారకులు గోపరాజు రామ చంద్ర రావు (గోరా)గారు ముదునూరు లో ”వయోజన పాథ   శాల” స్థాపించారు .ఆయనే ప్రిన్సిపాల్ .అయ్యదేవర కాలేశ్వర రావు పంతులు ,త్రిపురనేని రామస్వామి చౌదరి ,దుర్గాబాయి దేశముఖ్ ,టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన హేమా హేమీలంత వచ్చి అక్కడజాతీయ ,అంతర్జాతీయ ,సాంఘిక విషయాలపై ప్రసంగిస్తూ అభిరుచి కలిగించే వారు .మేజిక్ లాంటేర్న్ తో slide  లు  వేస్తూమాగంటి బాపినీడు  పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించే వారు .ఇవన్నీ రావు గారు దగ్గరుండి క్షుణ్ణం గా గమనించేవారు .మనసు లో ఏవేవో ఊహలు మేదిలేవి మెట్రిక్ పరీక్షలకు శిక్షణ కూడా ఇచ్చే వారు .అయితే వీటి మీద కంటే నాస్తిక ప్రచారానికి గోరా ఎక్కువ ప్రాముఖ్యత నివ్వటం తో క్రమంగా ఆకర్షణ తగ్గి పోయింది .ఆవు మాంసం పంది   మాంసం లతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసే వారు గోరా .ఇవి జనానికి రోత పుట్టించాయి .ప్రజలు నాస్తిక కేంద్రం అంటే మండి  పడే వారు .అ వూరి రైతు పెద్ద ,కాంగ్రెస్ నాయకుడు సశ్రీ అనే అంజయ్య గారు కూడా అసహ్యించుకొనే స్థితిని తెచ్చుకోనారు గోరా .ఇక” గో–రా ”అని పించికోకుండా నెమ్మదిగా ఆ వూరు వదిలేశారు .రావు గారు ఆ కేంద్రం లో వున్న లైబ్రరీ పుస్తకాలు చదివి విజ్ఞానం పొందారు .గోరాతో సరదాగా మాట్లాడే వారు .”దారి తప్పిన ప్రయాణీకుడు గోరా ”అంటారు రావు గారు గోరాను .ఎప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధ పడే వారు .అందుకని చాల సున్నితం గా కన పడే వారు .దీని వల్ల ఉపాధ్యాయులు ఆయన్ను” జపాన్ toy ”అని  పిలిచే  వారు ఆనాటిహెడ్మాస్టర్   పోక్కునూరి వెంకట రత్నం ,ఇంగ్లీష్ మేస్టారు చంద్ర శేఖర రావు లు ఆయనపై గాఢ ముద్ర వేశారు .వారి బోధన ప్రభావమే రావు గారిని ”హై స్కూల్ గ్రామర్ ”రాయటానికి కారణం అయింది . ” .                                           

రచనా జీవిత ప్రారంభం               

బందరు నోబుల్ హై స్కూల్ లో రా గారు ఎస్ .ఎస్ .ఎల్ .సి .లో చేరారు .ఇంగ్లీష్ లో చిన్న వ్యాసాలు రాసి ”అర్బుదం ”మేస్టారి తో దిద్దిన్చుకొనే వారు .1941 లోవిశ్వ కవి  రవీంద్ర నాద్ టాగూర్ మరణించారు .వారిపై ఇంగ్లీష్ లో మంచి వ్యాసం రాశారు .తరువాత రాసిన ”The teacher I like ,the teacher I wish to be ”వ్యాసం కాలేజి మాగజైన్ ”The noble comrade ”ప్రచురిత మైంది .ఈ వ్యాసం రాయటం లో రావు గారికి ఉపాధ్యాయ వ్రుత్తి పట్ల వున్న గౌరవం ,సంఘం లో ఉపాధ్యాయుని పాత్ర అర్ధమవుతాయి . కళాశాల జీవితం   1943 లో గుంటూరు హిందూ కాలేజి లో రావు గారు ఇంటర్ లో చేరిఅర్త్స్ సబ్జెక్ట్ తీసుకొన్నారు .పిల్లలమర్రివెంకట హనుమంత రావు గారు తెలుగులెక్చరర్  .వారి ప్రభావం బాగాపడింది  .ఆనాడు గుంటూరు ను” కల్చరల్ కాపిటల్ ఆఫ్ ఆంద్ర ”అనే వారు .ఆ కాలమ్ లో ”నవ్య    సాహిత్య పరిషత్ ”మంచి ఊపులో వుండేది.వాళ్ళు ”ప్రతిభ ”అనే మాస పత్రిక నడిపేవాళ్ళు ..ఆంద్ర దేశం లోని సుప్రసిద్ధ రచయితలకు అది వేదిక . .దాని ప్రబావం రావు గారి మీద వుంది .ఏదో సాహితీ సేవ చేయాలనే ఆలోచనలు సుళ్ళు తిరిగాయి .”సరస సారస్వత సమితి ”అనే సంస్థ రావు గారికి కలిగింది .”’శోభ ”అనే వార పత్రికా కూడా వారి ఊహల్లో వుంది,కార్యరూపం  దాల్చింది ఆయనే ఎడిటర్ .గోళ్ళ మూడి   రాధాకృష్ణ మూర్తి అనే చిత్రకారుడు ,హాష్య రచయిత ,సినీ నటుడు కొంగర జగ్గయ్య కళాదర్శకుడు వి.సూరన్న సుభద్రా దేవి సహకారం తో ;;శోభ ”శోభాయమానం గా వెలువడేది .జగ్గయ్య చక్కని దస్తూరి తో తీర్చి దిద్దే వాడు .కుందుర్తి ,కరుణశ్రీ ,మాచిరాజు దేవీ ప్రసాద్ ,బొడ్డు పల్లి పురుషోత్తం లాంటి ఉద్దండులు శోభకు రచనలు పంపే వారు .ఆంద్రవిశ్వ విద్యాలయ registraar    శ్రీ కూర్మా వేణుగోపాల స్వామి నాయుడు నుంచి మంచి సహకారం అందేది .సర్వశ్రీ కొండావెంకట  ప్పయ్య ,ఉన్నవ లక్ష్మి    నారాయణ ,మల్లం పల్లి సోమ శేఖర శర్మ ,అడివి బాపిరాజు ,సలహా సంఘ సభ్యులు .సంఘం తరఫున ఉచిత చిత్ర కళా శిక్షణ తరగతులు శ్రీ రాజా సింహ ఆధ్వర్యం లో జరిగేవి .ధర్మ వరం రామ కృష్ణ మాచార్యులు ,గురజాడ అప్పా రావు గార్ల వర్దంతులు జరిపే వారు .ప్రముఖులను ఆహ్వానించి ఉపన్యాసాలను ఏర్పాటు చేసే వారు .నాటికలు వేయించే వారు .ఫోటోగ్రఫి నేర్పేవారు .విహార  యాత్రలకు వెళ్ళే వారు .ఇవన్నీ రావు గారి ఆలోచనలే మంచి కార్యక్రమాలకు రూప కల్పన అమలు , .అందరు వారి మాటకు విలువ నిచ్చే వారు .1945  లో జరిగిన గురజాడ వర్ధంతి సభలో రావు గారు మొదటి ఉపన్యాసం చేశారు .అది ఆంద్ర ప్రభలో ప్రచురితమైంది .ఇలా రెండేళ్ళు వివిధ సాహిత్య ,సాంస్కృతిక కార్య క్రమాలు దిగ్విజం గా నిర్వహించి సమాజానికి కొత్తఆలోచనలను   పరిచయం చేశారు విద్యార్ధి దశ లోనే ఇంకా ఇంటర్ విద్యార్హి గా ఉండ గానే .1944 -45 -ల మధ్య ”జ్ఞాన ”అనే మాస పత్రిక నిర్వహించటానికి అనుమతి పొందినా ఆర్ధిక కారణాల వల్ల నిర్వహించ లేక వదిలేశారు .ఆ పత్రిక పేరు లోనే వారి జిజ్ఞాస ,అందించాల్సిన భావ ఔన్నత్యాలు మనకు అర్దమవుతున్నాయి అది కార్యరూపం  దాల్చక పోవటం మన దురదృష్టం . 1945 -బాపిరాజు ముదునూరు వారిని తాను సంపాదకుడు గా వుంటూ హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్న ”మీజాన్ ”పత్రికకు సబ్ ఎడిటర్ ని చేశారు .ఒకరకం గా ఆయన పెన్మన్ ఈయన .కోణంగి ,నరుడు నవలలను అలవోకగా బాపిరాజు గారు చెబుతుంటే రావు గారు రాసే వారు .అవి పత్రిక లో ధారా వాహికం గా వచ్చేవి .బాపిరాజు గారింట్లోనే వీరి మకాం .ఆయనకు పెళ్లీడు ఆడ పిల్ల లున్నారు .అందుకని ఈయన్ని ”బాపిరాజు గారి అల్లుడు ”అని సరదాగా అనే వాళ్ళు .ఈయనకు అసలలాంటి అభిప్రాయమే లేదు .ఆయన్ను తండ్రి లాగా చూశారు .ఆయింట్లో ఒకడు అంతే .బాపి బావ తో గడపటం ఒక గ్రందాగ్రందాలయం లో గడిపిన అనుభూతి అంటారు రావు గారు .రాజు గారిది చాలా విశాల దృక్పధం .బహుభాషా పండితుడు ,నిగర్వి ,సహృదయుడు ,.”ప్రాచీనులలో నవీనుడు -నవీనులలు ప్రాచీనుడు బాపి రాజు గారు ”అంటారు ముదునూరు వారు .శ్రీ శ్రీనివాస చక్ర వర్తి ,తిరుమల రామ చంద్ర ,రాంభొట్ల కృష్ణ మూర్తి వీరి తో పాటు మీజాన్ కు సబ్ ఎడిటర్లు .అంతా హేమ హేమీలే .వారి సాహచర్యం బంగారానికి తావి అబ్బినట్లు అయింది రావు గారికి ‘1946  లో వెంకటేశ్వర రావు గారి వివాహం పెదముత్తేవికి  చెందిన శాంత గారితో జరిగింది .ఆ వివాహ వేడుకలలో పెదముత్తేవి ఆశ్రమ యతీంద్రులు ,ముముక్షు పీథ అధిపతి  శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు ”బుర్ర కధ ”చెప్పటం గొప్ప హై లైట్ .           

గుంటూరు ఏ.సి .కాలేజి లో రావు గారు బి.ఏ. లో చేరారు .అప్పుడే బాపిరాజు గారు కూడా మీజాన్ వదిలిగుంటూరు   చేరుకున్నారు .మళ్ళీ గురుశిష్య సంబంధం గట్టి పడింది .అప్పుడే విజయంవాడ లో ఆకాశవాణి కేంద్రం మొదలైంది .బాపిరాజు దానికి సలహాదారు అయారు .గుంటూరు లో ”కళా పీఠం ”ఏర్పరచి ,చిత్రలేఖనం లో బాపిరాజు శిక్షణ ఇచ్చే వారు .యువకులైన వెంకటేశ్వర రావు వంటి వారి సాయం తో గొప్ప చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు .ఆ సమయం లో బి.ఎస్ .కృష్ణ ”కాంగ్రెస్ ”పత్రిక నడిపే వారు .”ఆంధ్రా రిపబ్లిక్ ”పత్రిక కూడా వస్తుండేది .రాజ్యం సిన్హా మద్రాస్ నుంచి ”మాతృభూమి ”మాస పత్రికను నడిపే వారు .ఆమె ముదునూరు కాంగ్రెస్ నాయకులు అన్నే  అంజయ్య గారి అన్న కుమార్తె .శాంతినికేతన్ విద్యార్ధిని .ఆమె భర్త విజయకుమార్ సిన్హా ” The Times of India ” లో ఎడిటింగ్ సెక్షన్ లో పని చేసే వారు .ఆయన విప్లవ వీరుడు ,అకలంక దేశభక్తుడు అయిన షహీద్ భగత్ సింగ్ అనుచరుడు .భగత్ సింగ్ ను బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన తరువాత సిన్హా గారిని మైనర్ అయినందు వల్ల  అండమాన్ దీవులకు పంపిందిప్రభుత్వం  .ఆయన అక్కడ జైలర్లకు ఒక విద్యాలయం ఏర్పాటు చేసి ,దేశ స్వాతంత్ర్యం అవసరాన్ని జాతీయ , పోరాటచరిత్ర  మున్నగు విషయాలను ప్రభావం చేస్తూ ప్రసంగించే వారు .తన అండమాన్ జీవితాన్ని గురించి ”,The Andamaan’s –The Indian Bastille ”. అనే గ్రంధం రాశారు .ఫ్రెంచ్ విప్లవం లో bastille జైలు కు వున్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే .సిన్హా జీవితం రావు గారిపై మంచి ప్రభావాన్ని చూపింది .ఎకనామిక్స్ అసోసియేషన్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి విజయవాడ బాచ్ కు ,గుంటూరు బాచ్ కు పోటీ తీవ్రం గా వుంది .యెన్.టి .రామా రావు విజయవా డబాచ్   తరఫున వైస్ ప్రెసిడెంట్ గా పోటి చేశాడు .రావు గారిని తన పానెల్ ఎన్నికయేట్లు సహాయం చేయమని అడిగారు .గుంటూరు మిత్రులు అడ్డుకున్నారు .ఇద్దరికీ రాజీ మార్గంగా అందరితో మాట్లాడి రామా రావు ను వైస్ ప్రెసిడెంట్ గా ,కార్యవర్గం గుంటూరు వారికి ఇచ్చేట్లు రావు గారు ఒప్పందం కుదిర్చి ఘర్షణ నివారించారు .అందరు హాపీ .కాలేజి గ్రంధాలయాన్ని సద్వినియోగం చేసుకొని విజ్ఞానాన్ని పెంచుకొన్నారు .పబ్లిక్ ఫైనాన్స్ డెమోక్రసీ చదివి ,దేశాన్ని ఆర్ధికం గా అభివృద్ధి చేసే విషయాలు తెలుసుకున్నారు .నెలకోసారి ”చర్చా సమావేశాలు ”జరిపే వారు .చర్చ రోజున రావు గారు ఖద్దర్ పైజమా ,చొక్కా ధరించే వారు .వారు అది ధరిస్తే ఆనాడు చర్చ ఉన్నట్లే లెక్క .రామా రావు ,జగ్గయ్య ,వల్లభ జోశ్యుల శివ రాం కాలేజీ లో నాటకాలు దర్శకత్వం చేస్తూ ఆడే వారు .రావు గారు కాలేజి మాగజైనును ఎడిటర్ గా వుండి నడి పెవారు .డిగ్రీ పూర్తి అవగానే ఉద్యోగాల వేట లో పడ్డారు .దేనిలోనూ ఎక్కువ కాలమ్ పని చేయ లేదు .                                                ఉద్యోగ పర్వం 

 గుంటూరు జిల్లా అమరావతి లో 1950 లో సోషల్ టీచర్ గా చేరారు అందరికంటే చిన్న ఆయనే.1950 ఆగస్ట్ 10 న తండ్రి గారు ముదునూరు లో ”జీవ ప్రాయశ్చిత్తం ”చేసుకొని స్వచ్చంద మరణం పొందారు .ఇక్కడ దీని గురించి వివరిస్తాను .మరణం ఆసన్నం అయింది తెలియగానే వెద పండితుల్ని పిలిపించి ”జీవ ప్రాయస్చ్ట్టం ”చేసు కోవటం విజ్ఞులకు అలవాటు గా వుండేది .దాదాపు ఆరు గంటలు వేదోచ్చారనతో జరుగు తుంది .అలా చేస్తే తెలిసి చేసినవి,తెలియక చేసినవి పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం .అంతే కాదు ఆ కార్య క్రమం అయి పోగానే యజమాని అనాయాసం గా మరణిస్తాడు .వీరి తండ్రి గారు కూడా ఆ రకం గాప్రాయశ్చిత్తం   చేసుకొని తీర్ధం తీసుకున్న వెంటనే మరణించారు .అదీ ”జీవ ప్రాయశ్చిత్తం ”మహాత్మ్యం .రావు గారి అన్న గారు శేషగిరి రావు కుటుంబ బాధ్యత స్వీకరించారు .”శాంతి నిలయం ”అనే ప్రైవేటు స్కూల్ నడపటం ప్రారంభించారు .అమరావతి హై స్కూల్ లో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రావు గారికి సహ ఉపాధ్యాడు .ఆయన హిందీ పండిట్ .పాతశాలకు వచ్చే పత్రికలను విద్యార్ధులు చదివే ఏర్పాటు రావు గారు చేశారు .వీరి ప్రోత్చాహం చూసి చుట్టూ పరకాల గ్రామాల విద్యార్ధులు ఇక్కడికి వచ్చి ,పాథశాల గ్రంధాలయాన్ని ఉపయోగించుకొనే వారు .రావు గార్తో [పరిసర గ్రామాలలో గ్రంధాలయాలను రావు గారితో స్థాపింప జేశే వారు .శిష్యులతో కలిసి గ్రంధాలయం   ఉద్యమాన్ని హరికధలు ,బుర్ర కధల ద్వారా వ్యాపింప జేశారు .విద్యార్ధుల విజ్ఞానాభి వృద్ధి కి ”విజ్ఞాన యాత్ర ”లకు తీసుకొని వెళ్ళేవారు .ఇటువంటివి ఆకాలాల్లో   ఏ స్కూల్ లోను జరిగేవి కావు .రావు గారి ముందు చూపు వల్లనే ఇక్కడ సాధ్యమైంది .”అమర జ్యోతి ”అనే పాథశాల పత్రిక ను కరుణశ్రీ తో కలిపి నిర్వహించారు . కరుణశ్రీ కి   మసూచి సోకితే ,నిర్భయం గా ఆయనకు సేవ చేసి నయం ఆయె దాకా కని పెట్టి వున్న మంచి మిత్రుడు రావు గారు .A friend in need is a friend indeed ”అన్నది అక్షరాల పాటించి చూపిన నిజమైన స్నేహితుడు రావు గారు .1951 లో కృష్ణా జిల్లా కాటూరు హై స్కూల్ లో సోషల్ టీచర్ గా చేరారు .ఆ ఊరిని   మాస్కో అఫ్ ఆంధ్ర అంటారు .దగ్గరలోనే వున్న స్వగ్రామం   ముదునూరు లో అన్నయ్య తో కలిసి ”వయోజన విద్యా కార్య క్రమాలు ”ప్రారంభించారు .దగ్గరలోనే వున్న బొల్లపాడు లో వయోజన విద్యా తరగతులు ఏర్పాటు చేశారు .ఇక్కడే గ్రంధాలయాన్ని స్థాపించారు .కాటూరు లో ప్రఖ్యాత కవి కాటూరి వెంకటేశ్వర రావు గారి అభ్యర్ధన పై వారింట్లోనేలోనే కాపురం వున్నారు .ఆవూరు లో వున్న’ సూరి స్కూల్ ‘లో సాయంత్ర వేళల్లో పిల్లల కార్య క్రమాలు మొదలు పెట్టారు .రాత్రి తరగతులు నిర్వహించారు .రాత్రి తొమ్మిది గంటలకు మహాకవి గురజాడ రచించిన ”దేశమును ప్రేమించుమన్నా ”అనే ప్రబోధ గీతం తో కార్య క్రమాలు ప్రారంభమై రాత్రి పదకొండు గంటలకు ”జన గణ మన ”తో పూర్తి అయేవి .పశువులకు వచ్చే అంటు వ్యాధులను గురించి slides వేసి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియ జేసే వారు .వయోజనులకోసం ”బుర్ర కధ దళం ”,”నాటక శాఖ ”ఏర్పాటు చేశారు .వీరి సాంఘిక కలాపాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభించింది చర్చా గోష్టులు జరిపే వారు .మోడల్ పార్లమెంట్ నిర్వహించే వారు .అందు లో సాంఘిక సమశ్యలపై ప్రత్యక్ష అనుభవం కల్గించే వారు రావు గారు .ఇవన్నీ  వారి బుద్ధి లో జన్మించిన అభ్యుదయ భావ పరంపరలే .అంత దూర దృష్టి వారిది .మళ్ళీ ఉదయం స్కూలు ,పాఠాలు యధాప్రకారమే .దానికీ ,దీనికీ వైరుధ్యం లేకుండా ,రెండిటిని సమర్ధ వంతం గా నిర్వహించటం కార్య శూరు లైన రావు గారికే సాధ్యం అని పించేవి .ఆ రోజుల్లో కరుణ శ్రీ నిర్వహించే ”శుభాషిని ‘పత్రిక లో మహిళా కార్య క్రమాలు చూసే వారు .”;;గొప్పవారి భార్యలు ”శీర్షికలో ప్రముఖులైన వారి సతీమణులు చేసిన ,చేస్తున్న ప్రజా సేవను గురించి రాసే వారు .radio లో రావు గారు ప్రముఖ రష్యా  కమ్యునిస్ట్ నేత లెనిన్ పై ప్రసంగించారు .                      1952 -53 -లో గుంటూరు బి ,యిడి ,లో చేరారు .అప్పుడే హై స్కూల్ విద్యార్ధుల కోసం ”హై స్కూల్ గ్రామర్ రాశారు .1953 లో ముదునూరు హై   స్కూల్ లో బి.యిడి . టీచర్ గా చేరారు ”శాంతి నిలయం ”పాథ శాల” మధుకరి” వ్రాత పత్రిక రావు గారి ఆద్వర్యం లో వచ్చింది .”శేఖర్ విద్యాలయం ”,శేఖర్ గ్రంధాలయం ”ఏర్పాటు చేశారు .పత్రికా రచనలో శిక్షణ నిచ్చారు .slides తయారు చేయటం నేర్పించారు .1953 నుంచి ముదునూరు లో పిల్లల కోసం ”బాల రాజ్యం ”,యువకులకు”సాంస్కృతిక కార్య క్రమ శాఖ” ఏర్పరచారు .మహిళ ల కోసం ”మహిళా శాఖ” నిర్వహించారు .చేతి పనుల శాఖ కూడా దిగ్విజం గా చేబట్టారు .ఇంటిముందున్న విశాలమైన హాల్ లో పిల్లలకు ,పెద్దవారికి విడి విడి గా గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు .ఆదివారాల్లో జేబురుమాలలు ,దిండు గలీబులు మహిళల చేత తయారు చేయించే వారు .వీటిని హైమవతి గారు పర్య వేక్షించే వారు .’ఈ విధం గా విభిన్న మైన కార్యక్రమాలు ప్రజలందరి కోసం చేబట్టిన గొప్ప ఆలోచనా పరుడు రావు గారు .ఒక రకం గా ముదునూరు గ్రామం వారికి ఎంతో రుణ పడి వుంది .దాని అభివృద్ధి లో ప్రతి అంగుళం లోను ఆయనకు భాగస్వామ్యం వుంది.ఆయన సేవలు నిరుపమానం .లెక్కకు మిక్కిలివి .వీటికి తోడు కుట్టు పని వయోలిన్ లో శిక్షణ ఇప్పించారు.

                               

Leave a Reply